Adah Sarma: తెలుగు హీరోయిన్ అదా శర్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ఈ భామ నితిన్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించి తెలుగులో బాగానే పాపులర్ అయ్యింది. ఇక ఆ మధ్య ది కేరళ స్టోరీ సినిమాతో బంపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రం 300 కోట్లకు పైగా వసూలు చేసి వావ్ అనిపించింది. అది అలా ఉంటే ఆదా శర్మ ఇటీవల ఓ చీరలో మెరిసింది. అయితే ఈ చీర కేవలం రూ. 15 మాత్రమేనట.
'ది కేరళ స్టోరీ' ఫేమ్ నటి అదా శర్మ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. నటి స్టైల్, ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఖరీదైన బట్టలతో సినీ తారలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే రికార్డులన్నీ కేవలం నటన కోసమే. తాజాగా ముంబైలో అదా శర్మ కనిపించింది. నటి లుక్స్ ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
లుక్ ఆసక్తిగా ఉండటంతో ఫోటో గ్రాఫర్లు ఆమెను క్లిక్ మనిపించారు. అంతలా అదా ఆకట్టుకోవడానికి గల కారణం ఏంటంటే.. ఆమె కట్టుకున్న చీర . ఆ చీర ధర తెలిస్తే అందరూ ఆశ్చర్య పోతారు ఎందుకంటే ఆ చీర కేవలం రూ.15 మాత్రమే.
ఆ చీర గురించి అదా మాట్లాడుతూ.. ‘‘ఈ చీర అదా శర్మ నానమ్మది. అప్పట్లో ఆమె ఈ చీరను కేవలం రూ. 15 కి కొనినట్లు తెలిపింది.
అదా శర్మ చీర ధర నెటిజన్లను షాక్ కి గురి చేసింది. అదా శర్మ చీరకట్టు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also read: మ్యాచ్‌కు ముందు పవన్ పాట వింటా : యువ క్రికెటర్ నితిశ్ రెడ్డి!