Varalakshmi Sarath kumar: ప్రధాని మోదీకి వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహ ఆహ్వానం.. ఫొటోలు వైరల్..!

నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసి తన వివాహానికి ఆహ్వానించారు. కాబోయే భర్త, కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీకి వెడ్డింగ్ కార్డు అందజేసి పెళ్ళికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

New Update
Varalakshmi Sarath kumar: ప్రధాని మోదీకి వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహ ఆహ్వానం.. ఫొటోలు వైరల్..!

Varalakshmi Sarath kumar: నటి వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ముంబైకి చెందిన ఆర్ట్‌ గ్యాలరీ నిర్వాహకుడు నిచోలై సచ్‌దేవ్‌ని పెళ్లాడనుంది.

Image

ఈ నేపథ్యంలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తన పెళ్లి ఆహ్వాన పత్రికలను అతిథులకు, సినీ, రాజకీయ ప్రముఖులకు అందజేయడం మొదలు పెట్టారు.ఇప్ప‌టికే టాలీవుడ్, కోలీవుడ్ లోని పలువురు సినీ ప్ర‌ముఖులతో పాటు రాజ‌కీయ ప్రముఖులకు తన వివాహ ఆహ్వానాన్ని అందించారు.

Image
తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కూడా తన వివాహానికి ఆహ్వానించారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్.కాబోయే భర్త, తల్లిదండ్రులు రాధికా, శరత్‌కుమార్ తో కలిసి ప్రధాని మోదీకి వెడ్డింగ్ కార్డు అందజేసి పెళ్ళికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

Image

ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇటీవలే టాలీవుడ్ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ, నిర్మాత అల్లు అరవింద్, సమంత, అల్లు అర్జున్ పలువురికి తమ పెళ్లి ఆహ్వానాన్ని అందించారు నటి వరలక్ష్మి.

Image

Also Read: Varalakshmi Sarath kumar : అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన కోలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా? - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు