Vaishnavi Chaitanya: పూట గడవడం కోసం అలా చేశా.. కన్నీళ్లు తెప్పిస్తున్న బేబీ హీరోయిన్ మాటలు బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది వైష్ణవి చైతన్య. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవి జీవితంలో తాను ఎదుర్కున్న కష్టాల గురించి చెప్పుకొచ్చింది. చిన్న వయసులోనే ఫ్యామిలీ బాధ్యతలు తీసుకోవడంతో పూట గడవడం కోసం రాత్రిళ్ళు బర్త్ డే పార్టీలో డాన్స్ చేసేదాన్నని తెలిపింది. By Archana 12 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Vaishnavi Chaitanya: సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి వైష్ణవి గురించి పరిచయం అక్కర్లేదు. సాఫ్ట్ వేర్ డెవలపర్ సీరీస్ తో ఫుల్ పాపులరైన ఈ బ్యూటీ.. బేబీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో తన నటనతో మెప్పించిన వైష్ణవి .. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. చిరంజీవి లాంటి స్టార్ హీరోలు సైతం ఈ ముద్దు గుమ్మ పై ప్రశంసల కురిపించారు. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. Also Read: Operation Valentine: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆపరేషన్ వాలెంటైన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? వైష్ణవి చైతన్య ఎమోషనల్ కామెంట్స్ ఇది ఇలా ఉంటే ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న వైష్ణవి.. జీతంలో తాను ఎదుర్కున్న కష్టాల గురించి చెప్పుకొచ్చింది. చిన్న వయసులోనే ఇంటి బాధ్యతలు చేపట్టిన వైష్ణవి పూట గడవడం కోసం రాత్రుళ్ళు బర్త్ డే పార్టీస్, పెళ్లి ఈవెంట్స్ లో డాన్స్ చేసేదాన్నని తెలిపింది. బర్త్ డే పార్టీలో డాన్స్ చేస్తే 700 రూపాయలు ఇచ్చేవారని.. ఆ డబ్బుతో అమ్మ మా కడుపునింపేది. యూట్యూబ్ వీడియోలు చేసే సమయంలో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సెపెరేట్ రూమ్ ఉండేది కాదు .. బాత్ రూమ్ లోనే బట్టలు మార్చుకునేదాన్నని చెప్పుకొచ్చింది. ఒక సినిమాలో చిన్న పాత్ర చేస్తున్న సమయంలో వాష్ రూమ్ కోసం క్యారవాన్ యూజ్ చేసుకోవాలని అడిగితే..తనను చాలా మాటలు అన్నారని ఎమోషనల్ అయ్యింది వైష్ణవి. ఇవన్నీ చూసి అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. వైష్ణవి ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. బేబీ తర్వాత ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవి.. ప్రస్తుతం 3 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. అందులో ఆశిష్ హీరోగా నటిస్తున్న 'లవ్ మీ' సినిమా ఒకటి. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు మేకర్స్. త్వరలోనే ఈసినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నట్లు సమాచారం. Also Read: Kiran Abbavaram: తన మొదటి సినిమా హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం..! #vaishnavi-chaitanya #baby-movie #vaishnavi-chaitanya-comments మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి