Trisha: పెళ్లి చేసుకోబోతున్న త్రిష..? వరుడు ఎవరో తెలుసా..!!

స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ మలయాళ నిర్మాతను త్రిష పెళ్లాడబోతోందని సోషల్ మీడియాలో నెటిజన్స్‌ హల్‌చల్ చేస్తున్నారు. త్వరలోనే త్రిష పెళ్లిపీటలు ఎక్కబోతుందని చెపుతున్నారు.అయితే, ఈ వార్త ఎంత వరకు నిజమనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Trisha: పెళ్లి చేసుకోబోతున్న త్రిష..? వరుడు ఎవరో తెలుసా..!!
New Update

Trisha Krishnan to Marry Malayalam Producer: హీరోయిన్‌ త్రిష క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.  వన్నె తగ్గని అందంతో ప్రేక్షకులను ఇప్పటికీ ఆమె కట్టిపడేస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 21 ఏళ్ళు నడుస్తున్న ఇప్పటికీ తరగని అందంతో మెరిసిపోతుంది. మరోవైపు, త్రిష (Trisha) గురించి ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ మలయాళ నిర్మాతను త్రిష పెళ్లాడబోతోందని సోషల్ మీడియాలో నెటిజన్స్‌ హల్‌చల్ చేస్తున్నారు. ఓ సినిమా సందర్భంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం.  త్వరలోనే త్రిష పెళ్లిపీటలు ఎక్కబోతోందని చెపుతున్నారు. అయితే, ఈ వార్తలు ఎంత వరకు నిజమనేది వేచి చూడాల్సిందే.

publive-image

హీరోయిన్ గా ఇప్పటికీ తన సత్తాను చాటుతోంది త్రిష. ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయంటే త్రిష డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకెళ్లుంది. 39 ఏళ్ల త్రిష ఇప్పటికీ చిన్న పిల్లలాగా కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్న హీరోయిన్లు సైతం త్రిష ఫిజిక్ ను  చూసి ఇలా ఎలా సాధ్యం అంటూ ఆశ్చర్యపోతున్నారు.

publive-image

త్రిష ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన వీడియోలు ఫోటోలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.  త్రిష లేటెస్ట్ ఫొటోస్ ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి. 25 ఏళ్ల యంగ్ బ్యూటీ లాగా త్రిష ఫొటోస్ లో కనిపిస్తోంది.  త్రిష చిలిపిగా, క్యూట్ గా ఇచ్చిన ఫోజులు నెటిజన్లని మెస్మరైజ్ చేస్తున్నాయి. చంద్రబింబంలా వెలిగిపోతున్న ముఖంలో చిరునవ్వు మరింత ఆకర్షిస్తోంది. ఇలా తన ఫ్యాన్స్ కి ఫోటోస్ పెట్టి తన స్టార్ డమ్ ను అలాగే మెంటేన్ చేస్తోంది.

publive-image

ఇప్పటికే నాలుగు పదుల వయసు సమీపిస్తున్నప్పటికీ త్రిష ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదని అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఆల్రెడీ త్రిషకి పెళ్లి విషయంలో చేదు అనుభవం ఎదురైంది కాబట్టి పెళ్లికి చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. గతంలో ఓ వ్యాపార వేత్తతో నిశ్చితార్థం జరిగి బ్రేకప్ అయిన విషయం తెలిసిందే. అయితే, త్రిష పెళ్లి కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి, త్రిష త్వరలోనే తన పెళ్లి గురించి గూడ్ న్యూస్ చెబుతుందా? లేదంటే సోషల్ మీడియాలో వస్తున్నా వార్తను లైట్ గా తీసుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: నేడు ఏఎన్ఆర్ శత జయంతి.. అన్నపూర్ణ స్టూడియోలో నాగేశ్వరరావు విగ్రహం ఆవిష్కరణ..

#trisha-krishnan #trisha-krishnan-to-marry-malayalam-producer #trisha-krishnan-marriage-rumours
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe