Tapsi Pannu : నా భర్త టీమిండియా కోచ్.. అతని గురించి ఎవరికీ తెలీదు : తాప్సి

హీరోయిన్ తాప్సి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో త‌న భ‌ర్త గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మ‌తియాస్ బో ఎవ‌రో చాలా మందికి తెలియదు. అత‌డు ప్ర‌పంచంలో ఉన్న దిగ్గ‌జ బ్యాడ్మింటన్ ప్లేయ‌ర్‌ల‌లో ఒక‌డు. ప్ర‌స్తుతం ఒలింపిక్స్‌లో టీంఇండియా బ్యాడ్మింటన్ కోచ్" అని తెలిపారు.

New Update
Tapsi Pannu : నా భర్త టీమిండియా కోచ్.. అతని గురించి ఎవరికీ తెలీదు : తాప్సి

Actress Taapsee Pannu : 'ఝుమ్మంది నాదం' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ.. మొదటి సినిమాతోనే తన నటన, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తరువాత తమిళ్, హిందీలోనూ తన సత్తా చాటింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతుంది.

ఇదిలా ఉంటే తాప్సి రీసెంట్‌గా డెన్మ‌ర్క్‌కు చెందిన మతియాస్ బో (Mathias Boe) అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. పెళ్లి తర్వాత త‌న భ‌ర్త గురించి ఎక్క‌డా న్యూస్ రాలేదు. తాప్సీ కూడా అత‌డితో ఉన్న ఫొటోల‌ను పోస్ట్ చేయ‌లేదు. అయితే తాజాగా తన కొత్త చిత్రం 'ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా' (Phir Aayi Hasseen Dillruba) ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా త‌న భ‌ర్త గురించి అడుగ‌గా.. ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Also Read : నేను రెండో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే : రేణు దేశాయ్

" నేను పెళ్లి చేసుకున్న త‌ర్వాత మ‌తియాస్ బో ఎవ‌రో చాలా మందికి తెలియదు. ఆ విష‌యంలో నాకు చాలా బాధగా ఉండేది. అయితే తాను ఎవ‌రు అనేది నేను కూడా చెప్పాలి అనుకోలేదు. అయితే అత‌డు ఒక క్రికెటర్ లేదా పెద్ద వ్యాపారవేత్త కాక‌పోవడం వ‌ల‌న జ‌నాల‌కు తెలుసుకోవాలని అనిపించకపోవ‌చ్చు.

కానీ అత‌డు ప్ర‌పంచంలో ఉన్న దిగ్గ‌జ బ్యాడ్మింటన్ ప్లేయ‌ర్‌ల‌లో ఒక‌డు అంతే కాకుండా ప్ర‌స్తుతం ఒలింపిక్స్‌లో టీంఇండియా బ్యాడ్మింటన్ కోచ్" అంటూ తెలిపింది. దీంతో తాప్సి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు