Actress Tamannah : రెండు సార్లు బ్రేకప్ అయింది.. తట్టుకోలేకపోయా.. తమన్నా ఎమోషనల్ కామెంట్స్

మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రిలేషన్‌షిప్‌లో తాను కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని చెప్పారు. టీనేజ్‌లోనే తొలిసారి ప్రేమలో పడ్డానని.. కొన్ని కారణాలతో అది వర్కౌట్ కాలేదని తెలిపారు. తన జీవితంలో రెండు బ్రేకప్స్‌ ఉన్నాయని వివరించారు.

New Update
Actress Tamannah : రెండు సార్లు బ్రేకప్ అయింది.. తట్టుకోలేకపోయా.. తమన్నా ఎమోషనల్ కామెంట్స్

Actress Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నా తన లవ్ లైఫ్ కు సంబంధించి నిత్యం వార్తల్లో ఉంటుంది. ఇప్పటికే ఆమె.. నటుడు విజయ్ వర్మ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు పబ్లిక్ చేయడంతో.. వీళ్ళ పెళ్లి గురించి సోషల్ మీడియాలో తరచూ చర్చలు జరుగుతున్నాయి. నిజానికి విజయ్ వర్మ కంటే ముందే తమన్నాకు రెండు సార్లు బ్రేకప్ అయిందట. ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.." ఇప్పటివరకూ రెండు సార్లు నా హృదయం ముక్కలైంది. ఆ సమయంలో నాకెంతో బాధగా అనిపించింది. టీనేజ్‌లో ఉన్నప్పుడే తొలి హార్ట్‌బ్రేక్‌ ఎదుర్కొన్నాను. ఒక వ్యక్తి కోసం నచ్చిన జీవితాన్ని వదులుకోవడం నాకు నచ్చలేదు. జీవితంలో ఏదో సాధించాలని.. కొత్త విషయాలు అన్వేషించాలనేది నా భావన. ఆ కారణంతోనే ఆ బంధం నిలవలేదు. ఆ తర్వాత మరో వ్యక్తితో కొంతకాలం రిలేషన్‌లో ఉన్నా.

Also Read : ప్లాప్ వచ్చినా తగ్గేదేలే.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ‘మిస్టర్ బచ్చన్’ హీరోయిన్

అయితే.. అతడు నాకు సెట్‌ కాడనిపించింది. ప్రతి చిన్న విషయానికీ అబద్ధం చెప్పేవాళ్లంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి వ్యక్తితో బంధాన్ని కొనసాగిస్తే ప్రమాదం అని అర్థమైంది. అలా అది కూడా ముగిసిపోయింది" అంటూ చెప్పుకొచ్చింది. తమన్నాకు రెండు సార్లు బ్రేకప్ అయిందనే వియషం తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు