Shraddha kapoor : ఆ హీరోలతో ఛాన్స్ వచ్చినా నటించకపోవడానికి కారణం అదే : శ్రద్ధా కపూర్

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్దా కపూర్.. బాలీవుడ్ ఖాన్ త్రయంతో నటించకపోడానికి గల కారణాన్ని వెల్లడించారు.' స్టార్ హీరోల సినిమాల్లో నటించడం కంటే నా క్యారెక్టర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటాను. అందుకే గతంలో వాళ్ళతో ఛాన్స్ వచ్చినా నటించలేదు'అని తెలిపారు.

Shraddha kapoor : ఆ హీరోలతో ఛాన్స్ వచ్చినా నటించకపోవడానికి కారణం అదే : శ్రద్ధా కపూర్
New Update

Actress Shraddha Kapoor : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ 'స్త్రీ 2' మూవీతో భారీ హిట్ అందుకుంది. ఇటీవలే థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్దా.. బాలీవుడ్ ఖాన్ త్రయంతో నటించకపోడానికి గల కారణాన్ని వెల్లడించారు.

స్టార్ హీరోల సినిమాల్లో నటించడం కంటే నా క్యారెక్టర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటాను. గతంలోనే నాకు వారి సినిమాల్లో నటించే ఆఫర్లు వచ్చాయి. నా పాత్రకు ప్రాధాన్యం లేదనే వాటిని తిరస్కరించాను. నాలోని నటికి ఆ క్యారెక్టర్‌ సరిపోతుందా..? సవాలుగా ఉంటుందా..? అనే విషయాలను పరిగణనలోకి తీసుకుంటాను. నా పాత్రకు ప్రాధాన్యం లేదని అనిపిస్తే.. అందులో హీరో ఎవరున్నా.. అంగీకరించను" అని తెలిపారు.

Also Read : N- కన్వెన్షన్ ఎఫెక్ట్, నాగార్జున పై తిరగబడ్డ ‘బిగ్ బాస్’ మాజీ కంటెస్టెంట్..హోస్ట్ గా తొలగించాలంటూ

దీంతో ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక 'స్త్రీ 2' మూవీ విషయానికొస్తే.. 2018లో వచ్చిన ‘స్త్రీ’కి సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. అమర్ కౌశిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ తో పాటూ రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా ప్రధాన పాత్రలు పోషించారు.

#actress-shraddha-kapoor
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe