Shraddha Kapoor : పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన 'సాహూ' బ్యూటీ.. ఏం చెప్పిందంటే?

శ్రద్ధా కపూర్ తాజాగా పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది. 'స్త్రీ 2' మూవీ 'ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ లో ఓ విలేకరి శ్రద్ధాను పెళ్లి గురించి ప్రశ్నించాడు . అందుకు ఆమె సినిమాలోని క్యారెక్టర్‌ని ఉద్దేశిస్తూ..' స్త్రీ తనకు ఇష్టమున్నప్పుడు పెళ్లి చేసుకుంటుంది' అని అన్నారు.

New Update
Shraddha Kapoor : పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన 'సాహూ' బ్యూటీ.. ఏం చెప్పిందంటే?

Actress Shraddha Kapoor About Her Marriage :బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి తెలిసిందే. 'ఆషీకీ 2' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు హిట్ మూవీస్ లో నటించింది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కలిసి 'సాహూ' సినిమా చేసి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఇక ఈ హీరోయిన్ బాలీవుడ్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'స్త్రీ 2'. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ముంబయిలో 'ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌' నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన శ్రద్ధా కపూర్‌ను ఓ విలేకరి పెళ్లి గురించి ప్రశ్నించగా.. ఆమె తనదైన శైలిలో సమాధానమిచ్చారు. సినిమాలోని క్యారెక్టర్‌ని ఉద్దేశిస్తూ..' స్త్రీ తనకు ఇష్టమున్నప్పుడు పెళ్లి చేసుకుంటుంది' అని అన్నారు. దీన్ని బట్టి శ్రద్ధా కపూర్ కు ఇప్పుడే పెళ్లి పై ఆసక్తి లేదని అర్థమవుతుంది.

Also Read : ‘కల్కి’ ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ఏకైక ఇండియన్ మూవీగా!

మరో వైపు గత కొన్ని నెలలుగా ఈ హీరోయిన్ స్క్రీన్‌ రైటర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌ మోడీతో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉన్నారని వార్తలు ప్రచారమైన విషయం తెలిసిందే. అతనితో కలిసి దిగిన సెల్ఫీని శ్రద్ధ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. ఆ వార్తలకు బలం చేకూరినట్టైంది. ఇక 'స్త్రీ 2' విషయానికొస్తే.. 2018లో వచ్చిన హిట్‌ మూవీ 'స్త్రీ' కి సీక్వెల్‌గా 'స్త్రీ 2' వస్తోంది. రాజ్‌కుమార్‌ రావ్‌, పంకజ్‌ త్రిపాఠి, అభిషేక్‌ బెనర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్నా ప్రత్యేక గీతంతో అలరించనున్నారు.

Advertisment
తాజా కథనాలు