Actress Samantha: టాలీవుడ్ స్టార్ నటి సమంత సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ ఉంటారు. తరచూ ఫిట్ నెస్, మెంటల్ హెల్త్ కు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ తన అభిమానులకు అవగాహన కల్పిస్తుంటుంది సామ్. తాజాగా హెల్త్ కు సంబంధించి సామ్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వివాదాస్పదంగా మారింది. వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు మందులకు ప్రత్యామ్నాయ విధానాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ సమయంలో మందులకు బదులుగా నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ (పీల్చడం) ఒక మంచి ఎంపిక అని సూచించింది . అనవసరంగా మాత్రలు వాడటం మానుకోండి అంటూ వీడియోను షేర్ చేసింది సామ్.
నటి సమంతా సైన్స్ తెలియని నిరక్షరాస్యురాలు
అయితే దీని పై ఓ వైద్య నిపుణుడు ఘాటుగా స్పందించాడు. హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం ప్రమాదకరమని ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. ప్రముఖ ఆరోగ్య నిపుణునుడు సమంత పోస్ట్ పై ఇలా రాసుకొచ్చారు.. "ప్రభావవంతమైన భారతీయ నటి సమంతా దురదృష్టవశాత్తూ ఆరోగ్యం, సైన్స్ తెలియని నిరక్షరాస్యురాలు. ఆమె మిలియన్ల మంది ఫాలోవర్లకు శ్వాసకోశ, వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి హైడ్రోజన్-పెరాక్సైడ్‌ను పీల్చమని సలహా ఇస్తుంది. సైంటిఫిక్ సొసైటీ, ది ఆస్త్మా అండ్ అలర్జీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆరోగ్యానికి ప్రమాదకరమని నెబ్యులైజ్ చేయవద్దని (పీల్చవద్దని) ప్రజలను హెచ్చరించింది. ప్రజారోగ్యానికి హాని కలిగించే ఈ సోషల్ మీడియా హెల్త్ ఇన్ ఫ్లుయెన్సర్స్ గురించి భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేదా ఏదైనా ఆరోగ్య నియంత్రణ సంస్థ ఏదైనా చర్య తీసుకుంటుందా..? లేదా బాధ్యత లేకుండా ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తారా..? సమంతను కఠినంగా శిక్షించాలి, ఆమెను జైల్లో పెట్టాలి అని రాసుకొచ్చారు." ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సమంత పోస్ట్
మరో వైపు సమంత దీనికి సంబంధించి మరో పోస్ట్ చేసింది. వైరల్ ఇన్ఫెక్షన్స్, శ్వాసకోశ సమస్యలను ట్రీట్ చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ న్యూబిలైజ్(పీల్చవచ్చని) చేయవచ్చని తెలిపిన అధ్యనాలు, వీడియోలను షేర్ చేసింది . ప్రముఖ ఆరోగ్య నిపుణుడు డాక్టర్ థామస్ లెవీ ప్రచురించిన ఒక ఆర్టికల్ షేర్ చేసింది.