Samantha : పెళ్లి గౌన్ ని రీ మోడలింగ్ చేయించిన సమంత.. నెట్టింట వీడియో వైరల్

New Update
Samantha : పెళ్లి గౌన్ ని రీ మోడలింగ్ చేయించిన సమంత.. నెట్టింట వీడియో వైరల్

Actress Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఏ చిన్న విషయాన్నైనా ఫ్యాన్స్ తో పంచుకోవడం సామ్ కి అలవాటు. అందుకే ఈమెకి సోషల్ మీడియాలో భారీ పాలోయింగ్ ఉంది. సామ్ ఎలాంటి పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఈ హీరోయిన్ చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. ఓ అవార్డు ఫంక్షన్ కోసం సమంత తన పెళ్లి గౌన్ ని రీ మోడల్ చేయించి ధరించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సమంత తాజాగా 'ఎల్లే సస్టైనబిలిటీ' అనే అవార్డు ఫంక్షన్ లో పాల్గొంది. ముంబై వేదికగా జరిగిన ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో సామ్ బ్లాక్ కలర్ గౌన్ లో మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.." ఎల్లే లీడర్స్ ఆఫ్ ఛేంజ్ గా నన్ను ఎంపిక చేసిన వాళ్లందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం కోసం నాకెంతో ఇష్టమైన గౌన్ ని రీ మోడలింగ్ చేయించి ఉపయోగించాను. ఈ గౌన్ ని ఎంతో అందంగా డిజైన్ చేసిన క్రేశాబజాజ్‌కి కృతజ్ఞతలు. నా అలవాట్లను మార్చుకోవడం, నా జీవన శైలిని మరింత స్థిరంగా చేసుకోవడంలో పాత దుస్తులను రీ మోడలింగ్ చేయించడం కూడా ఒకటి. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు" అని రాసుకొచ్చించి.

కాగా హీరో నాగ చైతన్య ని ప్రేమించి హిందూ, క్రిస్తవ సాంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్న సమంత.. క్రిస్టియన్ వెడ్డింగ్ లో భాగంగా తెల్లని గౌన్ ని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంది. ఇప్పుడు అదే గౌన్ ని రీ మోడలింగ్ పేరుతో నలుపు రంగులోకి మార్పించి దాన్ని అవార్డు ఫంక్షన్ కోసం ధరించడం విశేషం. ప్రస్తుతం సమంత రీ మోడలింగ్ గౌన్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Also Read : బంపర్ అఫర్ అందుకున్న శ్రీలీల.. ఏకంగా తమిళ స్టార్ హీరోతో రొమాన్స్?

Advertisment
తాజా కథనాలు