/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-41-1.jpg)
Sai Pallavi Receives Her MBBS Degree : సౌత్ సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. ఫిదా సినిమాతో (Fidaa Movie) హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. హీరోయిన్ కాకముందు ఆమె మంచి డ్యాన్సర్ అనే సంగతి తెలిసిందే. డ్యాన్సరే కాదు ఇప్పుడు డాక్టర్ కూడా. సాయి పల్లవి ఓ వైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే డాక్టర్ చదువుతోంది. కొన్నాళ్ల క్రితమే సాయి పల్లవి మెడిసిన్ పూర్తిచేసింది.
@Sai_Pallavi92 now not only actor also a doctor. She got MBBS Degree#saipallavi #mbbs #Georgia #tandel pic.twitter.com/zICfZdaEoO
— Rajababu Anumula (@Rajababu_a) July 6, 2024
జార్జియా దేశంలోని 'Tbilisi State Medical University' నుంచి మెడిసిన్ చేసింది.ఈ ప్రఖ్యాత యూనివర్సిటీ నుండి ఇటీవలే సాయి పల్లవి 'MBBS' డిగ్రీని అందుకుంది.ఈ సందర్బంగా ప్రస్తుతం తన కాన్వకేషన్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవి డాక్టర్ పట్టా అందుకోవడంతో ఇక నుంచి ఆమె సినిమాలకు గుడ్ బై చెబుతుందా? లేదా? అని ఫ్యాన్స్ లో ఓ కన్ఫ్యూజన్ మొదలైంది.
Also Read : ఓటీటీలోకి సుధీర్ బాబు యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరోం హర’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Happy DOCTOR'S DAY ♥️@Sai_Pallavi92#SaiPallavi #NationalDoctorsDay pic.twitter.com/1lxHXdMKK9
— Sai Pallavi FC™ (@SaipallaviFC) July 1, 2024
చాలామంది హీరోయిన్స్ డాక్టర్ అయ్యాక కూడా హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నారు. వాళ్ళలాగే సాయి పల్లవి కూడా సినిమాలు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో నాగ చైతన్య సరసన 'తండేల్' మూవీతో పాటు బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ తో 'రామాయణ' వంటి భారీ ప్రాజెక్ట్ లో నటిస్తుంది. అటు తమిళంలోనూ శివకార్తికేయన్ 'అమరన్' మూవీలో యాక్ట్ చేస్తుంది.