Rashmika Mandanna: నా కాబోయే భర్త VD లా ఉండాలి.. వైరలవుతున్న రష్మిక ట్వీట్

విజయ్ దేవరకొండ రష్మిక మధ్య  ఏదో ఉందన్న విషయానికి మరింత బలం చేకూరేలా ఆమె ట్వీట్‌ నెట్టింట్‌ వైరల్‌గా మారింది. రష్మిక భర్త VD(వేరి డేరింగ్‌)లా ఉండాలని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. ఇదే నిజమేనంటూ ఆమె రిప్లై పెట్టింది.

New Update
Rashmika Mandanna: నా కాబోయే భర్త  VD లా ఉండాలి.. వైరలవుతున్న రష్మిక ట్వీట్

Rashmika Mandanna:  నేషనల్ క్రష్ రష్మిక మందన వరుస సినిమాలతో బిజీగా సాగుతోంది. పుష్పతో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ రీసెంట్ గా యానిమల్ సక్సెస్ తో మరో సారి పాన్ ఇండియా స్థాయిలో ట్రెండ్ అయ్యింది. అయితే గత కొద్దిరోజులుగా రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లి కూడా చేసుకోబుతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక తాజాగా విజయ్ దేవరకొండకు రష్మికకు మధ్య  ఏదో ఉందన్న విషయానికి మరింత బలం చేకూరేలా.. రష్మిక చేసిన ట్వీట్ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.

నా భర్త VD లా ఉండాలి

సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ కనిపించే రష్మిక.. అప్పుడప్పుడు తన అభిమానులు అడిగిన చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానం చెప్తూ వారిని సంతోష పెడుతూ ఉంటుంది. అంతే కాదు  సోషల్ మీడియాలో ఆమెకు  ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ క్రమంలో రష్మిక ఫ్యాన్ పేజ్ వేదికగా ఓ అభిమాని ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు.

publive-image

రష్మిక భర్తగా మారాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్తూ ఆ పోస్ట్ ను షేర్ చేశాడు. "ఆమె నేషనల్ క్రష్.. ఆమె భర్త చాలా స్పెషల్ గా ఉండాలి. ఆమె భర్త VD లా ఉండాలి. అంటే నా ఉద్దేశం వెరీ డేరింగ్ అని. మేము ఆమెను ఖ్వీన్ అని పిలుస్తాము. అప్పుడు ఆమె భర్త కూడా కింగ్ లా ఉండాలి అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ పై స్పందించిన రష్మిక.. "అవును అది నిజం" అంటూ రిప్లై ఇచ్చింది. VD అంటే విజయ్ దేవరకొండ అని కూడా అర్థం రావడంతో ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. VD అర్థం వెరీ డేరింగ్ కాదు.. విజయ్ దేవరకొండ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్ 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు