Rashmika Mandanna: సోషల్ మీడియాలో వైరల్ అయిన తన ఫేక్ వీడియోపై నేషనల్ క్రష్ నటి రష్మిక మందన (Rashmika Mandanna) స్పందించారు. ఆన్‌లైన్ ద్వారా వ్యాప్తి చెందిన ఆ డీప్‌ఫేక్ వీడియో (Deepfake Video) గురించి మాట్లాడాల్సి రావడం తనను ఎంతో బాధిస్తోందని ఆమె అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
Also Read: సమంతకు ఏమైంది.. క్రయోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవడంపై ఫ్యాన్స్ ఆందోళన.!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని లిఫ్టులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫేక్ వీడియోపై రష్మిక అభిమానులతో పాటు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా స్పందించారు. ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరారు.
ఈ వీడియో పై నటి రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒక నటిగా ఉన్నప్పుడు ఇలాంటి జరిగింది కాబట్టి తట్టుకోగలిగానని.. ఒకవేళ తాను స్కూల్లోనో, కాలేజ్‌లోనో ఉన్న రోజుల్లో జరిగి ఉంటే తాను ఏమయ్యేదాన్నో అని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతికతను దుర్వినియోగం చేసి ఇలాంటి చేయడం వల్ల తనకు మాత్రమే నష్టం జరగలేదని.. మనలోని ప్రతి ఒక్కరికీ ఇది హాని చేస్తుందని రష్మిక మందన అభిప్రాయపడ్డారు.
ఈరోజు తాను ఒక మహిళగా, నటిగా ఈ స్థితిలో ఉన్నానంటే దానికి తన కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులే కారణమని.. వారు తనకు కల్పించిన రక్షణ, ప్రోత్సాహానికి కృతజ్ఞురాలునై ఉంటానని పేర్కొన్నారు. కానీ, ఒకవేళ తాను స్కూల్లోనో, కాలేజీలోనో చదువుకున్న రోజుల్లో ఇలా జరిగి ఉంటే ఈ పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కొనేదాన్నో ఊహించుకోలేనని అన్నారు. మనలోని చాలా మంది ఇలాంటి వాటికి గురికాకముందే తక్షణమే అందరూ కలిసి దీనిపై గొంతెత్తాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు.