Actress Pranita : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పవన్ హీరోయిన్..

హీరోయిన్ ప్రణీత రెండో సారి తల్లయ్యారు. ఇప్పటికే ఆమెకు 'ఆర్నా' అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఈసారి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్‌ పెడుతున్నారు. రెండోసారి తల్లి కావడంపై ప్రణీత స్పందిస్తూ ఆనందం వ్యక్తంచేశారు.

New Update
Actress Pranita : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పవన్ హీరోయిన్..

Actress Pranita Subash : టాలీవుడ్ లో 'అత్తారింటికి దారేది' సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన ప్రణీత రెండో సారి తల్లయ్యారు. ఇప్పటికే ఆమెకు 'ఆర్నా' అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈసారి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్‌ పెడుతున్నారు.

రెండోసారి తల్లి కావడంపై ప్రణీత స్పందిస్తూ ఆనందం వ్యక్తంచేశారు.' మా కుటుంబమంతా ఎంతో ఆనందంగా ఉంది. ప్రత్యేకించి మా కుమార్తె అర్నా తన తమ్ముడిని చూసి 'బేబి' అని పిలుస్తూ మురిసిపోతోంది. బాబు పెద్దయ్యేవరకు తనని చూసుకోవడం కోసం మరికొన్ని రోజులు నిద్ర లేని రాత్రులు గడపాలి. ఇది సవాలుతో కూడినది. మొదటిసారి గర్భిణిగా ఉన్నప్పుడు నేను అందరి సలహాలు వింటూ వారు చెప్పినట్లు చేశాను.

Also Read : The 3rd Case వచ్చేసింది.. నాని ఫస్ట్ లుక్ అదిరింది..!

కానీ, రెండోసారి నాకు కొన్ని విషయాలు తెలుసు కాబట్టి చాలా కూల్‌గా ఉన్నాను. ఒత్తిడికి గురికాకుండా ప్రతీ నిమిషాన్ని ఆస్వాదించాను. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను. అర్నా పుట్టినప్పుడు వెంటనే వర్క్‌లో బిజీ అయ్యాను. ఇప్పుడు కూడా అలానే పనిలో బిజీ కావాలని కోరుకుంటున్నా' అని అన్నారు

Advertisment
తాజా కథనాలు