Parvathy Thiruvothu : 'తంగలాన్' లో తల్లి పాత్ర పోషించడం పై స్పందించిన యంగ్ హీరోయిన్..!

‘తంగలాన్’ సినిమాలో తల్లి పాత్ర చేయడంపై హీరోయిన్ పార్వతి తిరువొతు తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..'మనసుకు నచ్చితే ఏ పాత్రైనా తప్పక చేస్తానని, వాటిపై వచ్చే కామెంట్స్‌ను పట్టించుకోనని' తెలిపారు.

New Update
Parvathy Thiruvothu : 'తంగలాన్' లో తల్లి పాత్ర పోషించడం పై స్పందించిన యంగ్ హీరోయిన్..!

Actress Parvathy Thiruvothu : కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘తంగలాన్’. 19వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కబాలి’ మూవీ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవిక మోహన్, పార్వతి తిరువొతూ హీరోయిన్స్ గా నటించారు. ఆగస్టు 15 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఇందులో భాగంగానే హీరోయిన్ పార్వతి తిరువొతు సినిమాలో తల్లి పాత్ర చేయడంపై స్పందించారు. ‘తంగలాన్‌’ లో పార్వతి తిరువొతుతల్లి పాత్రలో ఓ వైపు హీరోయిన్‌గా చేస్తూ ఈ కొత్త సినిమాలో మదర్‌ రోల్‌ ప్లే చేయడంతో నెట్టింట చర్చ జరిగింది. తాజా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పార్వతి దీనిపై స్పందించారు. మనసుకు నచ్చితే ఏ పాత్రైనా తప్పక చేస్తానని, వాటిపై వచ్చే కామెంట్స్‌ను పట్టించుకోనని తెలిపారు.

Also Read : ‘సింబా’ మూవీ రివ్యూ.. జగపతి బాబు, అనసూయ నటించిన సినిమా ఎలా ఉందంటే?

"నేను ఈ సినిమాలో గంగమ్మ పాత్రలో నటించా. పేరుకు తగ్గట్టు తెర వెనుకా నేను అమ్మ ప్రేమను పంచుతానని ముందుగా అనుకోలేదు. కానీ, తర్వాత నా అభిప్రాయం మారింది. నా క్యారెక్టర్‌కు చిన్న కుమారుడిగా నటించిన బాలుడు ఓ రోజు సెట్స్‌లో వాళ్లమ్మను చూడగానే ఏడ్వడం మొదలుపెట్టాడు. ఆమె తెచ్చిన బాటిల్‌తో నేను పాలు పట్టించగా.. ఏడుపు ఆపేశాడు. అప్పుడు నేను అమ్మగా ఫీలయ్యా. దాంతో, ఆ పాత్రపై మమకారం మరింత పెరిగింది. ఆ అనుభవంతో.. ఎలాంటి సందేహం లేకుండా ముందుకెళ్లా" అని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు