/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-12-8.jpg)
Actress Niddhi Agerwal : ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాజాసాబ్' సెట్స్‌లో రీసెంట్ గా హీరోయిన్ మాళవిక మోహనన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగిన విషయం తెలిసిందే. తాజగా ఇదే మూవీ సెట్స్ లో మరో హీరోయిన్ బర్త్ డే ను సెలెబ్రేట్ చేశారు. ఆమె మరెవరో కాదు ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. నేడు తన పుట్టిన రోజును రాజాసాబ్ షూటింగ్ సెట్లో సెలబ్రేట్ చేసారు. డైరెక్టర్ మారుతీతో పాటు మూవీ యూనిట్ ఈ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు.
దర్శకుడు మారుతితో పాటు సినిమా యూనిట్ మొత్తం నిధి అగర్వాల్‌కు విషెస్ చెప్పి ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ తన సంతోషాన్ని పంచుకుంటూ, తన బర్త్‌డేని ఇంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన చిత్ర యూనిట్‌కి థ్యాంక్స్ చెప్పింది. కాగా ప్రభాస్ మాత్రం ఈ సెలెబ్రేషన్ లో మిస్ అయ్యాడు.
Team #TheRajaSaab is thrilled to welcome the stunning @AgerwalNidhhi on board!😍 Celebrating her birthday on set with loads of love and excitement.💥#TheRajaSaabOnApril10th #Prabhas @DirectorMaruthi @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla @SKNOnline @MalavikaM_… pic.twitter.com/Csq1ls5cjV
— People Media Factory (@peoplemediafcy) August 17, 2024
Also Read : ‘కాంతారా’ హీరోకి నేషనల్ అవార్డు.. అల్లు అర్జున్ రియాక్షన్ ఇదే..!
ఆయన తన కొత్త సినిమా లాంచింగ్ ఈవెంట్ కు వెళ్లారు. ఇక రాజా సాబ్ విషయానికొస్తే.. రొమాంటిక్ హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
View this post on Instagram