Mrunal Thakur : ఆ సినిమా నిర్మాతలతో గొడవ పడ్డ మృణాల్ ఠాకూర్.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన 'సీతారామం' బ్యూటీ! మృణాల్ ఠాకూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని పంచుకుంది. 'పూజా మేరీ జాన్' సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని, ఆ పాత్ర తనకే దక్కాలని ఎంతో కోరుకున్నానని, అందుకోసం నిర్మాతలతో సైతం గొడవ పడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. By Anil Kumar 31 Jul 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Actress Mrunal Thakur : బాలీవుడ్, టాలీవుడ్‌లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ తాజాగా షేర్ చేసిన ఓ విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక సినిమాలో ప్రధాన పాత్ర పొందడానికి నిర్మాతలతో గొడవ పడాల్సి వచ్చిందని ఆమె తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'పూజా మేరీ జాన్' సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని, ఆ పాత్ర తనకే దక్కాలని ఎంతో కోరుకున్నానని మృణాల్ తెలిపింది. ఆడిషన్లు, స్క్రీన్ టెస్ట్స్ చేసిన తర్వాత కూడా ఆ పాత్ర మరో నటికి ఇవ్వబోతున్నారని తెలిసి నిర్మాతలతో గొడవ పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చింది. " నేను ప్రధాన పాత్రలో నటించిన చిత్రాల్లో ‘పూజా మేరీ జాన్’ ఒకటి. రెండేళ్ల క్రితమే చిత్రీకరించాం. బహుశా ఈ ఏడాది విడుదల కావొచ్చు. ‘సీతారామం’ షూట్ పూర్తైన వెంటనే ఈ సినిమా స్క్రీన్ టెస్ట్‌లో పాల్గొన్నా. ఇందులో పాత్ర నచ్చింది. ఇలాంటి రోల్‌లో ఎప్పటి నుంచో యాక్ట్ చేయాలనుకుంటున్నా. Also Read : ఎన్టీఆర్ తో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ సినిమా తీస్తున్నాడా? అసలు నిజం ఇదే..! నా నిజ జీవితానికి ఈ కథతో ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఈ కథ కోసం మరొక నటిని ఎంచుకుంటున్నారని తెలిసి.. నిర్మాతలతో గొడవ పడ్డా. ఈ రోల్ చేస్తానని చెప్పా. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చా. స్క్రీన్ టెస్టుల్లో పాల్గొన్నా.ఒక్క మాటలో చెప్పాలంటే నిర్మాతలను ప్రాధేయపడి ఇందులో యాక్ట్ చేశా" అని తెలిపింది. కాగా రీసెంట్ గా 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు చేస్తుంది. #actress-mrunal-thakur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి