Mrunal Thakur : 'సారీ.. అది నిజం కాదు'.. మృణాల్ పోస్ట్ తో నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్!

హను రాఘవపూడి - ప్రభాస్ కాంబోలో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. తాజాగా మృణాల్ దీనిపై స్పందించింది. 'సారీ, ఈ చిత్రంలో నేను భాగమవ్వడం లేదంటూ' ఇన్స్టాలో పోస్ట్ చేసింది.

New Update
Mrunal Thakur : 'సారీ.. అది నిజం కాదు'.. మృణాల్ పోస్ట్ తో నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్!

Actress Mrunal Thakur: 'సీతారామం' సినిమాతో భారీ కం బ్యాక్ అందుకున్న హను రాఘవపూడి ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో (Prabhas) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పీరియాడికల్‌ బ్యాక్ డ్రాప్ యాక్షన్‌ లవ్‌స్టోరీతో ఈ సినిమా ఉండబోతుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుందని గత కొద్దీ రోజులుగా నెట్టింట ప్రచారం జరుగుతుంది.

తాజాగా మృణాల్ ఠాకూర్ దీనిపై స్వయంగా క్లారిటీ ఇచ్చింది.ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ లో ఓ పోస్ట్ పెట్టింది. " చిత్రంలో నేను భాగమవ్వడం లేదు.. అంటూ రిప్లై ఇచ్చింది. మొత్తానికి సీతారామం (Sita Ramam) తర్వాత మరోసారి హనురాఘవపూడి సినిమాలో నటించడం లేదని మృణాళ్‌ ఠాకూర్‌ ఇచ్చిన ఈ సమాధానంతో నిరాశలో మునిగిపోతున్నారు ప్రభాస్‌ అభిమానులు.

Also Read : ఎన్టీఆర్ కు యాక్సిడెంట్.. టీమ్ కీలక ప్రకటన

వైబ్ కిల్లర్ అవ్వడానికి నాకు ఇష్టం లేదు కానీ, ఈ సినిమాలో నేను భాగమవ్వడం లేదు.. అంటూ రిప్లై ఇచ్చింది. ఈ పోస్ట్ తో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోతున్నారు. కాగా యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందనున్న ఈ సినిమా కథనం భారతదేశ స్వాతంత్య్రం పూర్వానికి ముందు జరుగుతుందని, బ్రిటిష్‌ సైన్యంలో పని చేసే సైనికుడి పాత్రలో ప్రభాస్‌ కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

publive-image

Advertisment
తాజా కథనాలు