Megha Aakash : పెళ్లి పీటలెక్కబోతున్న నితిన్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా?

మేఘా ఆకాష్ పెళ్లి కూతురిగా ముస్తాబై.. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానికి 'వెడ్డింగ్ వైబ్స్' అనే హ్యాష్ ట్యాగ్ జోడించడంతో త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోనుందని సమాచారం.

New Update
Megha Aakash : పెళ్లి పీటలెక్కబోతున్న నితిన్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా?

Actress Megha Aakash Marriage : సినీ ఇండస్ట్రీ(Cine Industry) లో ఈ మధ్య హీరోయిన్స్(Heroines) ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్న విషయం తెలిసిందే. యంగ్ హీరొయిన్స్ తో పాటూ సీనియర్ హీరోయిన్స్ సైతం పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో హీరోయిన్ కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు హీరోయిన్ మేఘా ఆకాష్(Megha Akash). తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియా(Social Media) లో హాట్ టాపిక్ గా మారింది.

పెళ్ళికి రెడీ అయిన మేఘా ఆకాష్

నితిన్ సరసన 'లై' సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాష్. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటూ తమిళంలోనూ వరుస అవకాశాలు అందుకుంది. గత ఏడాది ఏకంగా మూడు సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కాగా ఈ ఏడాది ఆరంభంలో మేఘా ఆకాష్ పెళ్లి(Marriage) చేసుకోబోతోందని వార్తలు వచ్చాయి.

రాజకీయ నాయకుడి కొడుకుతో

మేఘా ఆకాష్ తమిళనాడుకి చెందిన ఓ రాజకీయ నాయకుడి కొడుకుతో ఏడడుగులు వేయనుందని ప్రచారం జరిగింది. ఐతే దీనిపై ఎవరూ రెస్పాండ్ అవ్వకపోవడంతో ఆమె పెళ్లి టాపిక్ అందరూ మర్చిపోయారు. ఇక తాజాగా మేఘా ఆకాష్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తో మరోసారి ఈమె పెళ్లి మ్యాటర్ మళ్ళీ బయటికిచ్చింది.

పెళ్లి కూతురి గెటప్ లో మేఘా ఆకాష్

మేఘా ఆకాష్ పెళ్లి కూతురిగా ముస్తాబై.. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానికి 'వెడ్డింగ్ వైబ్స్' అనే హ్యాష్ ట్యాగ్ జోడించడంతో త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోనుందని తెలుస్తోంది. మేఘ ఆకాష్ పెళ్లి వార్తలు నిజమే అయినప్పటికీ కొద్ది నెలల తర్వాతే ఆమె పెళ్లి ఉంటుందని, ఆమె షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ మాత్రం ఓ యాడ్ షూట్ కి సంబంధించినవిగా సమాచారం.

Also Read : 64 ఏళ్ళ వయసులో బాలయ్య విన్యాసాలు.. ఆయన ఇంకా కుర్రాడే అంటున్న నెటిజన్లు!

Advertisment
Advertisment
తాజా కథనాలు