జాక్ పాట్ కొట్టిన 'ప్రేమలు' బ్యూటీ.. కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..!

తలపతి విజయ్ తన లాస్ట్ మూవీని హెచ్. వినోద్ తో చేయబోతున్నాడు. ఈ మూవీలో 'ప్రేమలు' ఫేం మమితా బైజు కీలక పాత్రలో నటించబోతుంతుందట. సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం మూవీ టీమ్ ఆమెను సంప్రదించాడట. దీనికి మమితా కూడా ఓకే చెప్పిందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

New Update
జాక్ పాట్ కొట్టిన 'ప్రేమలు' బ్యూటీ.. కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..!

Actress Mamita Baiju : కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ లాస్ట్ మూవీకి సంబంధించి తమిళ మీడియాలో రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. రీసెంట్ గానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'ది గోట్' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత తన లాస్ట్ ప్రాజెక్ట్ ని హెచ్.వినోద్ తో చేయబోతున్నాడు.

అజిత్ తో వలిమై, తునీవు వంటి హిట్ సినిమాలని తెరకెక్కించిన ఈయన.. విజయ్ కోసం ఓ పొలిటికల్ స్టోరీని రెడీ చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. సమంత, కీర్తి సురేష్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారంటూ ఇప్పటికే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. మేకర్స్‌ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read : అజిత్ – త్రిష కాంబోలో డబుల్ హ్యాట్రిక్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?

అయితే తాజాగా ఈ మూవీలో ప్రేమలు ఫేం మమితా బైజు కీలక పాత్రలో నటించబోతుందన్న న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం మమితా బైజును సంప్రదించాడట వినోథ్‌. దీనికి ఆమె కూడా ఓకే చెప్పిందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే ప్రేమలు బ్యూటీకి జాక్ పాట్ తగిలినట్లే అని చెప్పొచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు