Actress Kovai Sarala : కోవై సరళ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

'అలీతో సరదాగా' షోలో పాల్గొన్న కోవై సరళను అలీ 'మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడిగితె అందుకు ఆమె బదులిస్తూ.." కచ్చితంగా పెళ్లి చేసుకోవాలనే కండీషన్ అయితే లేదు కదా! నేను నా స్వేచ్ఛ కోసమే పెళ్లి చేసుకోలేదని అన్నారు .

New Update
Actress Kovai Sarala : కోవై సరళ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

Senior Actress Kovai Sarala Interview : దక్షిణాది సినీ పరిశ్రమ(South Cine Industry) లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కోవై సరళ(Kovai Sarala). ముఖ్యంగా కామెడీ రోల్స్(Comedy Roles) లో తన నటించి కామెడీ క్వీన్ గా పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీ కి ఎంతమంది లేడీ కమెడియన్స్ వచ్చినా కోవై సరళ కామెడీ టైమింగ్ ని ఎవరూ మ్యాచ్ చేయలేకపోయారంటే అతిశయోక్తి కాదేమో.

మన తెలుగులో బ్రహ్మనందం(Brahmanandam), కోవై సరళ జోడి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. వీళ్ళిదరి జోడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎంతో మంది అగ్ర హీరోలతో కలిసి వందలాది సినిమాలు చేసిన కోవై సరళ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. అందుకు గల కారణాన్ని తాజాగా వెల్లడించారు.

Also Read : ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మరింత ఆలస్యంగా ‘రాజా సాబ్’

కోవై సరళ తాజాగా 'ఆలీతో సరదాగా' షోకి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ షోలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగానే తాను ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు.

దాని కోసమే పెళ్లి చేసుకోలేదు

'అలీతో సరదాగా' షోలో పాల్గొన్న కోవై సరళను అలీ 'మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడిగితె అందుకు ఆమె బదులిస్తూ.." కచ్చితంగా పెళ్లి చేసుకోవాలనే కండీషన్ అయితే లేదు కదా! నేను నా స్వేచ్ఛ కోసమే పెళ్లి చేసుకోలేదు. నాకు బోర్ కొడితే హిమాచల్ ప్రదేశ్ వెళ్తాను. తరచుగా షిరిడీ కూడా వెళ్తుంటాను.

మనం భూమి మీద ఒంటరిగా వచ్చాము. ఆ తర్వాతే ఈ బంధాలన్నీ వచ్చాయి. ఎంతోమంది పిల్లలు ఉన్నవాళ్లు కూడా చివర్లో ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. ఒకరు మనల్ని చూడాలని ఎప్పుడూ అనుకోకూడదు. ధైర్యంగా ముందుకెళ్ళాలి" అని చెప్పుకొచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Balagam GV Babu: బలగం జీవీ బాబు.. కన్నీరు పెట్టిస్తున్న ఆఖరి ఫొటోలు

బలగం నటుడు జీవీ బాబు కీడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటూ వరంగల్ ఆసుపత్రిలో మృతి చెందారు. చనిపోయే ముందు బలగం చిత్ర బృందంలోని సభ్యులు బాలు కాయితి, ఆకునూరి దేవయ్య ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన ఆఖరి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
Advertisment
Advertisment