/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-22.jpg)
Actress Kangana Ranaut : భారతదేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన ముకేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీకి వివాహం జులైలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఫార్మారంగ వ్యాపారవేత్త వీరేన్, శైల మర్చంట్‌ల కుమార్తె రాధిక మర్చంట్ ను అనంత్ వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకలో సినీ, రాజకీయ, వ్యాపార వేత్తలు పాల్గొన్నారు.
ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ అంతా ఈ వేడుకలో సందడి చేయగా.. ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ను పిలిచినా కూడా వెళ్లలేదట. అందుకు గల కారణాన్ని తాజాగా వెల్లడించారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ.." అనంత్ అంబానీ చాలా మంచి వ్యక్తి. నాకు ఫోన్ చేసి మరీ తన పెళ్లికి ఆహ్వానించారు. తప్పకుండా రమ్మని చెప్పారు. అదే రోజున మా ఇంట్లో కూడా పెళ్లి ఉండటంతో నేను రాలేనని చెప్పా.
Also Read : సీనియర్ నటుడు సిద్ధిఖీ పై లైంగిక ఆరోపణలు.. కీలక పదవికి రాజీనామా!
ఆ రోజు మాకెంతో ప్రత్యేకమని.. నా చిన్న సోదరుడు వివాహం ఉందని తెలియజేశా. మరో విషయం ఏమిటంటే నాకు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వెడ్డింగ్స్‌లో పాల్గొనడంలో అంత పెద్దగా ఆసక్తి ఉండదు. కుటుంబ వేడుకల్లో మాత్రమే నేను ఇష్టంగా పాల్గొంటా. నూతన జంటకు అంతా మంచే జరగాలని నేను కోరుకుంటున్నా" అని పేర్కొన్నారు.