కేపీ చౌదరి కేసులో స్పందించిన నటి జ్యోతి

హైదరాబాద్‌లో కేపీ చౌదరితో కాల్స్ వ్యవహారంపై నటి జ్యోతి స్పందించారు. తాను ఈ మాదకద్రవ్యాల కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు. కేవలం ఫ్రెండ్‌షిప్, ఫ్యామిలీ బాండింగ్ తప్ప ఎలాంటి సంబంధం లేదన్నారు. నేను అలాంటి పార్టీలకు హాజరవ్వనని, తనపై దుష్ప్రచారం చేయొద్దని జ్యోతి విజ్ఞప్తి చేశారు.

New Update
కేపీ చౌదరి కేసులో స్పందించిన నటి జ్యోతి

Actress Jyoti reacts on calls affair with KP Chaudhary

విచారణకు సిద్ధం

కేపీ చౌదరితో కాల్స్ వ్యవహారంపై నటి జ్యోతి స్పందించారు. తాను ఈ మాదకద్రవ్యాల కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు. కేపీ చౌదరితో తనకు కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉందని, ఫ్యామిలీ బాండింగ్ తప్ప మాదకద్రవ్యాలతో సంబంధం లేదన్నారు. ఏ విచారణకు అయినా తాను సిద్ధంగానే ఉన్నానని, తన ఫోన్ పోలీసులకు ఇవ్వడానికి కూడా సిద్ధమేనని ఆమె స్పష్టం చేశారు. డేటా రిట్రీవ్ చేసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. తాను ఎప్పుడూ మాదకద్రవ్యాలు కన్ఫ్యూమ్ చేయలేదని, ఏ తప్పు చేయలేదని, భయపడేదిలేదని చెప్పారు. సిక్కిరెడ్డి వాళ్ళ ఇంట్లో పార్టీ జరిగిందంటున్నారు. అలాంటి పార్టీలకు తాను హాజరవ్వనని, తనపై దుష్ప్రచారం చేయొద్దని జ్యోతి కోరారు.

సెలబ్రెటీలకు నోటీసులు

కాగా మాదకద్రవ్యాల కేసులో పోలీసులు సెలబ్రెటీలకు నోటీసులు ఇవ్వనున్నారు. కేపీ చౌదరి వ్యవహారంలో మాదకద్రవ్యాలపై సైబరాబాద్ పోలీసులు విచారించునున్నారు. మదక దవ్వల వ్యవహారంపై సినీతారలు, సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. కేపీ చౌదరి రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. గూగుల్ డ్రైవ్‌లో ఉన్న డేటాను పోలీసులు సేకరించారు. దీంతో సెలబ్రెటీలు, ఇతర వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. అయితే కేపీ చౌదరి నిర్మాతగా ఉన్నారు కాబట్టి తమ మధ్య ఫోన్ కాంటాక్టులు సహజమని సినీ ప్రముఖులు చెబుతూ.. ఏ విచారణకైనా, టెస్ట్ కైనా సిద్ధమని సెలబ్రిటీలు అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు