Actress Janhvi Kapoor : జాన్వీ కపూర్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉలఝ్’ (Ulajh Movie). జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా డైరెక్ట్ చేశారు. గుల్షన్ దేవయ్య, రాజేశ్ థైలాంగ్‌తోపాటు అదిల్ హుస్సేన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తన జుట్టు గురించి మాట్లాడుతూ, కెరీర్ మారే అవకాశమైనా తన జుట్టును కత్తిరించుకోవడానికి ఇష్టపడనని తెలిపారు. ‘ఎలాంటి పాత్రలో నటించకూడదని నిర్ణయించుకున్నారు?’ అని యాంకర్ అడగ్గా జాన్వీ స్పందించారు.
"హెయిర్ లేకుండా నటించాల్సి వస్తే నేనెప్పుడూ నో చెబుతా. ఎంత కష్టమైన పాత్రైనా పోషిస్తాగానీ జుట్టు లేకుండా కనిపించేందుకు ఇష్టపడను. ‘ఉలఝ్’లోని పాత్ర కోసం దర్శకుడు నా హెయిర్‌ను కొంత కట్ చేయాలని సూచించగా గొడవ పడ్డా (నవ్వుతూ). నా తొలి సినిమా 'ధడక్' కోసం జుట్టు కత్తిరించుకున్నా.
Also Read : ఆ విషయంలో శ్రీదేవి – జాన్వీ కపూర్ సేమ్ టూ సేమ్ : బాలీవుడ్ నటుడు
దానికి మా అమ్మ 'ఎందుకిలా చేశావ్?' అంటూ అరిచింది. ఏ రోల్ కోసమైనా హెయిర్ కట్ చేసుకోవద్దని చెప్పింది. నాజుట్టంటే ఆమెకు అంత ఇష్టం. మూడు రోజులకొకసారి ఆయిల్ రాసి మసాజ్ చేసేది. అమ్మ కారణంగానే హెయిర్ కట్ చేసుకోను" అని తెలిపింది. దీంతో జాన్వీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారాయి.