Janhvi Kapoor : అలాంటి రోల్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా : జాన్వీ కపూర్

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా ‘ఉలఝ్‌’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. కెరీర్ లో సవాళ్లతో కూడిన పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పింది.

New Update
Janhvi Kapoor  : అలాంటి రోల్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా : జాన్వీ కపూర్

Actress Janhvi Kapoor : స్వర్గీయ శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. తొలి చిత్రం 'ధడక్' తోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘ఉలఝ్‌’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.." నా జీవితమంతా నటనకే అంకితం. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను. పరిశ్రమ నన్ను ఎలా చూస్తుందన్న విషయాన్ని నేను చెప్పలేను. పాటలు, డ్యాన్స్‌లు, గ్లామర్‌తో కూడిన కమర్షియల్‌ సినిమాలు చేస్తే.. అది చాలా సులభమైన ప్రయాణం అవుతుంది. విజయం సాధించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. తక్కువ సమయంలోనే ప్రజాదరణ సొంతమవుతుంది.

Also Read : నితీష్ తివారి ‘రామాయణ’లో మరో బాలీవుడ్ నటుడు..!

కానీ, నేను రిస్క్‌తో కూడిన పాత్రలను ఎంచుకోవడానికి ఇష్టపడతాను. అందులో నా నటన చూసి ఆశ్చర్యపోవాలని అనుకుంటాను. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నాను. అందులో భాగంగానే చిన్న సినిమాలను ఎంచుకున్నాను. ప్రతి సినిమాలోనూ దర్శకుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడో దాన్ని ఇవ్వడానికి వందశాతం ప్రయత్నిస్తాను. ఇప్పటి వరకు రెండు హైరిస్క్‌ ఉన్న సినిమాలు ఎంచుకున్నాను. వాటిలో ఒకటి ‘ఉలఝ్‌’. అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను" అని చెప్పుకొచ్చింది.


Advertisment
Advertisment
తాజా కథనాలు