/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/hema-6.jpg)
Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో (Bangalore Rave Party) సినీ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో గత నెల 20న రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆమె రక్త నమూనాలో డ్రగ్స్ పాజిటివ్‌ను గుర్తించిన సీసీబీ పోలీసులు ఆమెను విచారణకు రావాలని మూడుసార్లు నోటీసులు ఇచ్చారు. రెండుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ హేమ విచారణకు హాజరుకాలేదు. మూడోసారి నోటీసుతో ఆమె విచారణకు హాజరయ్యారు.
Also Read: వైసీపీకి ఎదురుదెబ్బ.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేం.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్ట్..!
రేవ్ పార్టీ నిర్వహణలో నటి హేమ కీలక పాత్ర వహించినట్లుగా పోలీసులు గుర్తించారు. విచారణ అనంతరం పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రేపు హేమను కోర్టులో హాజరుపరచనున్నారు. బుర్ఖా ధరించి వైద్య పరీక్షలు చేయించుకున్న నటి వీడియో వైరల్ అవుతోంది.