Bengalore Rave Party: నటి హేమకు 14 రోజుల జ్యూడీషియల్‌ కస్టడీ!

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన సినీ నటి హేమకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. సోమవారం సీసీబీ పోలీసులు ఆమెను బెంగళూరు శివారు ప్రాంతం అనేకల్ లోని జేఎంఎఫ్‌సీ కోర్టు జడ్జి ఏఎస్ సల్మా ఎదుట హాజరుపరచగా...జడ్జి నటి హేమకు జ్యుడీషియల్ కస్టడీని విధించారు

New Update
Bengaluru: యాక్టర్ హేమకు షరతులతో కూడిన బెయిల్

Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన సినీ నటి హేమకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. సోమవారం సీసీబీ పోలీసులు ఆమెను బెంగళూరు శివారు ప్రాంతం అనేకల్ లోని జేఎంఎఫ్‌సీ కోర్టు జడ్జి ఏఎస్ సల్మా ఎదుట హాజరుపరచగా...జడ్జి నటి హేమకు జ్యుడీషియల్ కస్టడీని విధించారు. అంతకుముందు రేవ్ పార్టీ గురించి సీసీబీ పోలీసులు ఆమెను వేర్వేరు కోణాల్లో విచారణ జరిపారు. ఐదుగురితో కలిసి హేమ రేవ్ పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు. ఆ తర్వాత అరెస్ట్ చేసినట్లు ప్రకటించి, జడ్జి ఎదుట హాజరుపరిచారు.

వైద్య పరీక్షల అనంతరం హేమను పోలీసులు బయటకు తీసుకువచ్చిన సమయంలో ఆమె మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై మీడియా తప్పుడు కథనాలు ప్రచురించిందని ఆగ్రహం తెలిపారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదన్నారు. ఇప్పుడే తనను ఇక్కడకు తీసుకు వచ్చారన్నారు. పరీక్షల కోసం తన హెయిర్, యూరిన్, నెయిల్ శాంపిల్స్ ఇప్పుడే తీసుకుంటున్నట్లు చెప్పారు. డ్రగ్స్ కేసులో తన శాంపిల్స్ ఇంతకుముందు తీసుకోకపోయినా మీడియా ఎలా నిర్ధారిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు.

Also read: విద్యుత్‌ కాంతులతో మెరిసిపోతున్న టీడీపీ కార్యాలయం!

Advertisment
Advertisment
తాజా కథనాలు