/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-21T091653.917.jpg)
Actress Hema: టాలీవుడ్ నటి హేమ రీసెంట్ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. మొదట తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించగా ... ఆ తర్వాత హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ఆధారాలు బయట పెట్టారు అధికారులు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి విచారణ కోసం ఆమెను పోలీసులు అరెస్టు చేయగా.. ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చింది.
నటి హేమ పోస్ట్
బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత.. తాజాగా సోషల్ మీడియాలో హేమ పోస్ట్ చేసిన పలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనను కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటూ ఆమె పెట్టిన వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. వీడియోలో హేమ మాట్లాడుతూ.. "నన్ను మీడియా ఒక టెరరిస్ట్‌లాగా ప్రచారం చేస్తుంది. ఇలా చేస్తే నేను ప్రముఖుల దగ్గరకు ఎలా వెళ్ళాలి. వాళ్ళతో ఎలా మాట్లాడాలి. కొందరు మీడియా వాళ్ళు నన్ను కూడా బ్లాక్ మెయిల్ చేశారు.
సెటిల్‌మెంట్ కు రమ్మని అడిగారు. నాకు మీడియా వారికి ఎలాంటి గొడవలు లేవు. ఏ తప్పు చేయనిది నేనెందుకు రావాలి. బ్లాక్ మెయిల్ చేసిన వారి నెంబర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. త్వరలో అప్డేట్ చేస్తాను. ప్లీజ్ నా వాయిస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు తీసెకెళ్లండి. నాకు సపోర్ట్ చేసే నా అన్నాదమ్ముల మీదనే ఈ బాధ్యత ఉంది. ప్లీజ్.. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది హేమా."
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Also Read: Yuvraj Singh : వెండితెరపైకి యువరాజ్ సింగ్ బయోపిక్.. నటించేది ఎవరంటే? - Rtvlive.com