Hema: తిరుమలలో నటి హేమ కొత్త గెటప్.. అరెస్ట్ తరువాత మొదటిసారి ఇలా..!

టాలీవుడ్‌ సినీనటి హేమ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇటీవల బెంగళూరు డ్రగ్స్‌ కేసులో ఆమె బెయిల్‌పై బయటకు వచ్చింది. తాజాగా, నాడు స్వామివారిని దర్శించుకున్నహేమను మీడియా ప్రతినిధులు రేవ్ పార్టీ విషయంపై ప్రశ్నించారు. ఆమె స్పందిస్తూ.. అసలేం జరిగిందనేది మీకే తెలియాలి అంటూ సెటైర్లు వేసింది.

Hema: తిరుమలలో నటి హేమ కొత్త గెటప్.. అరెస్ట్ తరువాత మొదటిసారి ఇలా..!
New Update

Actress Hema: టాలీవుడ్‌ సినీనటి హేమ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇటీవల బెంగళూరు డ్రగ్స్‌ కేసులో ఆమె ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మొదట తనకు ఎలాంటి సంబంధం లేదని వీడియోలతో బుకాయించినా.. రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నట్లు సిటీ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆధారాలను బయటపెట్టారు. డ్రగ్స్‌ కేసులో ఆమెను విచారించిన పోలీసులు తరువాత అరెస్ట్ చేశారు. అనంతరం నటి హేమ బెయిల్‌పై బయటకు వచ్చింది.

Also Read: కానిస్టేబుల్ కనుసన్నల్లో ఎర్రచందనం అక్రమ రవాణా..!

తాజాగా, సినీనటి హేమ నాడు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకుంది. అనంతరం ఆలయం నుండి బయటకు వచ్చిన హేమ దర్శనం బాగానే జరిగిందన్నారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు రేవ్‌ పార్టీపై ప్రశ్నించగా.. అసలేం జరిగిందనేది మీకే తెలియాలి.. అనేక కథనాలు రాశారు కదా అంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పింది.

Also Read: తిరుమలలో బయటపడ్డ మాజీ మంత్రి పెద్దిరెడ్డి పెత్తనం.. విజిలెన్స్ తనిఖీలలో సంచలన విషయాలు..!

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అరెస్ట్ తరువాత హేమ మొదటిసారి కనిపించడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎందుకంటే నటి హేమ కొత్త గెటప్ లో కనిపించారు. మెడలో దేవుడి మాలా ధరించింది. అంతేకాకుండా చేతికి కూడా మాల ధరించడం విషేషంగా మారింది. అరెస్ట్ తరువాత హేమకి భక్తి ఎక్కువ అయిందంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు.

#actress-hema
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe