Rave Party : రెండు రోజుల్లో అందరి సంగతి తేలుస్తా.. రేవ్ పార్టీ పై హేమ సంచలన ఆడియో!

టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతున్న ఈ రేవ్ పార్టీ లో ప్రముఖ నటి హేమ పాల్గొన్నట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయమై నటి హేమను Rtv బృందం ఫోన్ లో సంప్రదించగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అది తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

New Update
Rave Party : రెండు రోజుల్లో అందరి సంగతి తేలుస్తా.. రేవ్ పార్టీ పై హేమ సంచలన ఆడియో!

Actress Hema Clarity About Rave Party : ఇటీవల తెరపైకి వచ్చిన రేవ్ పార్టీ రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతున్న ఈ రేవ్ పార్టీ లో ప్రముఖ నటి హేమ పాల్గొన్నట్లు కథనాలు రాగా.. అది నిజం కాదంటూ హేమ ఓ వీడియోని రిలీజ్ చేసింది.

అయితే ఆ వీడియోని హేమ బెంగుళూరులోనే షూట్ చేసి హైదరాబాద్ లో ఉన్నట్లు కవర్ చేసిందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా రేవ్ పార్టీలో హేమ కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇదే విషయమై నటి హేమను Rtv బృందం ఫోన్ లో సంప్రదించగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

రెండు రోజుల్లో అందరి సంగతి తేలుస్తా

ఈ మేరకు హేమ Rtv తో ఫోన్ లో మాట్లాడుతూ.. " రేవ్‌ పార్టీపై అన్ని విషయాలను చెబుతా. నేను ఏ తప్పు చేయలేదు. దీనిపై అందరికీ క్లారిటీ ఇచ్చా. నేను హైదరాబాద్‌లోనే ఉన్నా.. బెంగళూరులో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ప్రెజెంట్ నాకు కొంత స్పెస్ కావాలి. ఓ రెండురోజుల్లో నేనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి అందరి సంగతి తేలుస్తా. నేను భయంతో పారిపోయేదాన్ని కాదు. అలా చేసేదాన్ని అయితే గత రెండు రోజుల్లో దాదాపు 500 వరకు మీడియా కాల్స్ అటెంప్ట్ చేసి అందరితో మాట్లాడేదాన్ని కాదు. ఇది ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో, దీని వెనక ఎవడు ఉన్నాడో, ఎవడు చేపిస్తున్నాడో అన్నీ కనిపెడతా" అంటూ వివరణ ఇచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు