Anjali : 'గేమ్ ఛేంజర్' లో నేనే హీరోయిన్ : అంజలి

New Update
Anjali : 'గేమ్ ఛేంజర్' లో నేనే హీరోయిన్ : అంజలి

Actress Anjali About Her Role In Game Changer Movie : రీసెంట్ గా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' (Geetanjali Malli Vachindi) సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన తెలుగమ్మాయి అంజలి.. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాతో రాబోతోంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాలో అంజలి (Anjali) కీలకపాత్ర పోషించింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో అంజలి గేమ్ ఛేంజర్ లో తన రోల్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

నాది కూడా హీరోయిన్ రోలే

తాజా ప్రెస్ మీట్ లో అంజలి మాట్లాడుతూ.." గేమ్‌ ఛేంజర్‌ (Game Changer) లో నేను కీ రోల్‌కే పరిమితం కాదు. అందులో నేనో హీరోయిన్‌. ఈ సినిమాలో నేను క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కనిపిస్తానని మేకర్స్‌ ప్రకటించలేదు కదా. నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రానంత వరకు అన్నీ రూమర్సే.ఈ చిత్రంలో హీరోయిన్‌ కియారా అద్వానీ , అంజలి ఓ పాత్ర పోషిస్తుందని చాలామంది అనుకుంటున్నారు.

అది గాసిప్‌ మాత్రమే. నా పాత్రకు సంబంధించి ఫ్యాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌, ఓ అందమైన పాట ఉంటాయి. ఇంతకుమించి ఏం చెప్పలేను" అని తెలిపింది. అంజలి కామెంట్స్ తో గేమ్ చేంజర్ మూవీపై ఫ్యాన్స్ లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. కాగా గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ తండ్రీ, కొడుకులుగా కనిపించనున్నారు. ఇప్పుడు అంజలి చెప్పినదాన్ని బట్టి చూస్తే తండ్రి పాత్ర చేస్తున్న రామ్ చరణ్ (Ram Charan) కి భార్యగా నటించినట్లు స్పష్టమవుతుంది.

Also Read : రేవ్ పార్టీ అంటే.. ఊగిపోయే సినిమా లోకం

Advertisment
తాజా కథనాలు