Actress Gouthami: ఎన్నికలు తరముకొస్తున్న వేళ బీజేపీకి పెద్ద షాక్‌..రాజీనామా చేసిన నటి!

తమిళనాడులో బీజేపీ తరుఫున క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న గౌతమికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ..ఆమెకి పార్టీ అధిష్టానం టికెట్‌ ఇవ్వలేదు. అయినప్పటికీ ఆమె పార్టీకి అనుగుణంగానే పని చేశారు. కానీ ఇటీవల ఆమెకు తమిళనాడు నేతల నుంచి ఆమెకు కొన్ని చేదు అనుభవాలు ఎదురు అయ్యాయి. దీంతో ఆమె పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని ట్విట్టర్‌ ద్వారా ఆమె తెలిపారు.

New Update
Actress Gouthami: ఎన్నికలు తరముకొస్తున్న వేళ బీజేపీకి పెద్ద షాక్‌..రాజీనామా చేసిన నటి!

అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ తన దైన శైలిలో రాణిస్తున్న నటి గౌతమి. తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కి గురిచేసింది. సుమారు పాతికేళ్లుగా ఉన్న బీజేపీ కి ఆమె గుడ్‌ బై చెప్పింది. గౌతమి తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం తమిళనాట సెన్సేషన్‌ గా మారింది.

గత 25 సంవత్సరాలుగా ఆమె బీజేపీ తరుఫున ప్రతి పక్షాలకు  గళం గట్టిగా వినిపించేది. ఆమె రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటనే విషయం లోకి వెళ్తే..గౌతమిని పార్టీలోని ఓ వ్యక్తి కొన్ని విషయాల్లో నమ్మించి మోసం చేయడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

తమిళనాడులో బీజేపీ తరుఫున క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న గౌతమికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ..ఆమెకి పార్టీ అధిష్టానం టికెట్‌ ఇవ్వలేదు. అయినప్పటికీ ఆమె పార్టీకి అనుగుణంగానే పని చేశారు. కానీ ఇటీవల ఆమెకు తమిళనాడు నేతల నుంచి ఆమెకు కొన్ని చేదు అనుభవాలు ఎదురు అయ్యాయి. దీంతో ఆమె పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని ట్విట్టర్‌ ద్వారా ఆమె తెలిపారు.

ఆమె అభిమానులు, కార్యకర్తలతో ఆమె ఓ లేఖను కూడా పంచుకున్నారు. '' బీజేపీతో నాకు ఉన్న 25 ఏళ్ల అనుబంధం ముగిసింది. నా రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తమిళనాడు స్టేట్‌ చీఫ్‌ అన్నామలైకి పంపించాను అని ఆమె తన ట్విట్టర్ లో తెలిపారు.

అంతే కాకుండా ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. నా నుంచి డబ్బు, ఆస్తులు, కొన్ని డాక్యుమెంట్ల రూపంలో మోసం చేశారు. అంతేకాకుండా పార్టీలో కూడా ఏ నేత కూడా తనకు సపోర్ట్‌ చేయడం లేదని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా నాకు అన్యాయం చేసిన వ్యక్తికి కొందరు పార్టీ నేతలు సపోర్ట్‌ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

తన రాజీనామా అనంతరం రాసి లేఖలో గతంలో తాను జరిగిన చీటింగ్‌పై పోలీస్ కేసు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, న్యాయ వ్యవస్థ తనకు న్యాయం చేస్తుందనే ఆశాభావంతో ఉన్నాను అని గౌతమి వెల్లడించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు