Actor Vishwak Sen : విశ్వక్ సేన్ తయారు చేసిన మట్టి వినాయకుడు.. ఎంత అందంగా ఉందో చూడండి

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తన ఇంట్లో మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశాడు. ఆ విగ్రహాన్ని ఆయనే తన చేతులతో స్వయంగా తయారు చేయడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దాన్ని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

Actor Vishwak Sen : విశ్వక్ సేన్ తయారు చేసిన మట్టి వినాయకుడు.. ఎంత అందంగా ఉందో చూడండి
New Update

Actor Vishwak Sen : దేశ వ్యాప్తంగా వినాయక చతుర్థి వేడుకలు అంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీలంతా గణపయ్యను ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తున్నారు. కొందరు స్వయంగా తమ ఇళ్లలోనే వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. మన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం ఇంట్లో మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశాడు. ఆ విగ్రహాన్ని ఆయనే తన చేతులతో స్వయంగా తయారు చేయడం విశేషం.

Also Read : సాయి కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. తండ్రి దర్శకత్వంలో తనయుడి సినిమా

అందుకు సంబంధించిన వీడియోను ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందులో విశ్వక్ సేన్ మట్టి గణపతిని ఎంతో శ్రద్ధతో తయారు చేశాడు. దీన్ని చూసిన నెటిజన్స్..' వావ్, గణపతి మట్టి విగ్రహం చాలా అందంగా ఉందని, విశ్వక్ సేన్, మీలో ఈ టాలెంట్ కూడా ఉందా? మీరు సూపర్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విశ్వక్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మెకానిక్ రాకి, లైలా సినిమాలు చేస్తున్నాడు. వీటిలో 'మెకానిక్ రాకి' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

#actor-vishwak-sen
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి