Sundeep Kishan : నాకు ఆ సమస్య ఉంది.. దాని వల్ల ఓ రోజు షూటింగ్ లో ఊపిరి ఆడక.. : సందీప్ కిషన్

టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ తాజా ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్యల గురించి ఓపెన్ అయ్యారు. తాను కొంతకాలంగా సైనస్, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నానని, ఈ సమస్యల వల్ల షూటింగ్ సమయంలో ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించాడు.

Sundeep Kishan : నాకు ఆ సమస్య ఉంది.. దాని వల్ల ఓ రోజు షూటింగ్ లో ఊపిరి ఆడక.. : సందీప్ కిషన్
New Update

Actor Sundeep Kishan : టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్యల గురించి ఓపెన్ అయ్యారు. సందీప్ కిషన్ కొంతకాలంగా సైనస్, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నానని, ఈ సమస్యల వల్ల షూటింగ్ సమయంలో ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించాడు.

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన 'రాయన్' మూవీలో సందీప్ కిషన్ ఓ కీలక పాత్ర పోషించాడు. జులై 26 న ఈ మూవీ తమిళ్, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సంధర్భంగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న సందీప్ కిషన్ తాజాగా మీడియాతో సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగానే షూటింగ్ లో జరిగిన ఓ సంఘటన గురించి మాట్లాడాడు.

Also Read : మరో ఐటెం సాంగ్ తో అదరగొట్టిన తమన్నా.. ఆకట్టుకుంటున్న ‘ఆజ్ కీ రాత్’ సాంగ్ !

" నాకు అసలే సైనస్, శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి. షూటింగ్ లో ఒక సీన్ కోసం చాలా పొగ, ధూళితో కూడిన వాతావరణంలో నటించాల్సి వచ్చింది. దీంతో నాకు చాలా ఇబ్బంది అయింది. ఊపిరి ఆడక నాకు చాలా కష్టంగా అనిపించింది. అక్కడే ఉన్నవాళ్ళు వెంటనే అంబులెన్స్ పిలుద్దాం అన్నారు. నేను అక్కర్లేదు అని చెప్పి బయటకి వెళ్లి ఒక పది నిముషాలు రెస్ట్ తీసుకొని, గాలి పీల్చుకొని మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయ్యాను" అని తెలిపాడు. కాగా తన హెల్త్ కు సంబంధించి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని, తన ఆరోగ్యం మెరుగుపడుతోందని అన్నారు.

#actor-sundeep-kishan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe