Actor Sundeep Kishan : సందీప్ కిషన్ మంచి మనసు.. అభిమాని అడగ్గానే డబ్బులు పంపిన హీరో

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ మంచి మనసు చాటుకున్నారు. ఓ వ్యక్తి తన తల్లికి యాక్సిడెంట్ కావడంతో ఐసీయూలో ఉంది, రూ.60 వేలు కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో సందీప్ కిషన్ అతని అకౌంట్‌కు రూ. 50 వేలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

New Update
Actor Sundeep Kishan

Actor Sundeep Kishan : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తన మంచి మనసు చాటుకున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన తల్లికి యాక్సిడెంట్ కావడంతో ఐసీయూలో ఉంది అర్జెంట్‌గా రూ. 60 వేలు కావాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చూసిన సందీప్ కిషన్ వెంటనే రియాక్ట్ అయి అతని అకౌంట్‌కు రూ. 50 వేలు ట్రాన్స్ఫర్ చేశాడు.

దానిని సక్రమంగా పరిశీలించి.. నా వంతు సహాయం చేశాను అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన నెటిజన్స్ సందీప్ కిషన్ రియల్ హీరో అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సందీప్ కిషన్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది 'ఊరు పేరు భైరవకోన' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Also Read : ‘కాంధార్‌ హైజాక్‌’ వివాదంపై స్పందించిన నెట్‌ఫ్లిక్స్‌.. ఉగ్రవాదుల పేర్లు మార్చింది అందుకే అంటూ

ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇక రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన 'రాయన్' లో ప్రధాన పాత్ర పోషించాడు. ప్రస్తుతం 'వైబ్' అనే సినిమా చేస్తున్నాడు. ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు