Siddhant Chaturvedi : నాన్న ఎంకరేజ్ చేస్తేనే దీపికాతో బోల్డ్ సీన్స్ చేశా.. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్!

'గెహ్రైయన్' సినిమాలో దీపిక పడుకొణెతో బోల్డ్ సీన్స్ చేయడం గురించి సిద్ధాంత్ చతుర్వేది తాజా ఇంటర్వ్యూలో మాట్లాడాడు. దీపికతో ఇంటిమేట్ సీన్స్ చేయడానికి చాలా భయపడ్డాను. ఆ టైం లో మా నాన్న అది వృత్తిలో భాగమేనని, ఎక్కువగా ఆలోచించిద్దని ఎంకరేజ్ చేయడంతో నటించానని అన్నాడు.

New Update
Siddhant Chaturvedi : నాన్న ఎంకరేజ్ చేస్తేనే దీపికాతో బోల్డ్ సీన్స్ చేశా.. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్!

Actor Siddhant Chaturvedi : బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది తన సహనటి దీపిక పడుకొణెతో ఇంటిమేట్ సీన్స్ చేయడానికి ముందు భయపడ్డట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. 'గెహ్రైయన్' సినిమాలో వీరిద్దరి మధ్య ఉన్న ఇంటిమేట్ సన్నివేశాలు చాలా చర్చనీయాంశమయ్యాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సిద్ధాంత్ మాట్లాడుతూ, "నేను దీపికతో ఇంటిమేట్ సీన్స్ చేయడానికి చాలా భయపడ్డాను. ఆమెతో రొమాంటిక్ సన్నివేశాలు చేయడం నాకు కొత్త అనుభవం.

కానీ ఆ టైం లో నిర్మాత కరణ్‌ జోహార్‌, మా నాన్న నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఆరోజు మా నాన్న చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. గొప్ప దర్శకుడు, పేరుపొందిన నిర్మాణసంస్థ, స్టార్‌ క్యాస్ట్‌.. భారతదేశంలో ఉన్న చాలామంది యువ నటులు ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తుంటారు. అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి విషయాలను వాళ్లు ఎక్కువగా ఆలోచించరు. నువ్వు ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఇది నీ వృత్తిలో భాగమే. ఎక్కువగా ఆలోచించి చింతించకు అన్నారు.

కరణ్‌ సైతం ఇదేవిధంగా ధైర్యం చెప్పారు. వాళ్ల మాటలతో ఆయా సన్నివేశాల్లో యాక్ట్‌ చేశా" అని అన్నాడు. అంతేకాకుండా ఇంటిమేట్ సీన్స్ చేయడానికి ముందు ప్రత్యేకమైన వర్క్‌షాప్‌లు నిర్వహించామని, అవి చాలా ఉపయోగపడ్డాయని, సినిమాలో తన పాత్రకు న్యాయం చేయడానికి తాను ఎంతో కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు.

Also Read : ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకలో మెగా ఫ్యామిలీ.. అరుదైన వీడియో షేర్ చేసిన ఉపాసన..!


Advertisment
తాజా కథనాలు