Bigg Boss: ఆ కంటెస్టెంట్ కోసం.. చిరంజీవి రోజూ బిగ్ బాస్ చూసేవారట.. ఎవరో తెలుసా..!

ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ గా ముగిసింది. ఈ షో ఎంత పాపులర్ అంటే.. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ షోను ఫాలో అవుతారట. ప్రత్యేకంగా ఒక కంటెస్టెంట్ గేమ్ బాగా నచ్చడంతో చిరంజీవి, సురేఖ రెగ్యులర్ గా బిగ్ బాస్ షో చూసేవారట. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

Bigg Boss: ఆ కంటెస్టెంట్ కోసం.. చిరంజీవి రోజూ బిగ్ బాస్ చూసేవారట.. ఎవరో తెలుసా..!
New Update

Bigg Boss: గత సీజన్స్ తో పోలిస్తే సీజన్ 7 ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో సూపర్ సక్సెస్ అయ్యింది. ఉల్టా పుల్టా అన్నట్లుగానే ట్విస్ట్ లు, షాకులతో సీజన్ అంతా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ముఖ్యంగా ఈ సీజన్ అంతా ఒక రెండు గ్రూప్స్ చుట్టే నడిచిందని చెప్పొచ్చు. స్పా, స్పై బ్యాచ్ ఈ రెండు గ్రూపులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. చివరికి ఊహించినట్లే స్పై బ్యాచ్ నుంచి ఒకరు విన్నర్ అయ్యాడు. అమర్ దీప్ రన్నరప్, శివాజీ థర్డ్ ప్లేస్ లో బయటకు వచ్చారు. ముందు నుంచి శివాజీ విన్ అవుతారనే టాక్ బాగా వినిపించింది. కానీ ఉల్టా పుల్టా అన్నట్లు శివాజీ శిష్యుడు.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచి హిస్టరీ క్రియేట్ చేశారు. ఈ విషయంలో శివాజీ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్ లో కూడా ప్రశాంత్ విన్నర్ అవ్వడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు శివాజీ.(Shivaji)

Also Read: Anasuya latest photos: ఫ్యామిలీతో కలిసి జిమ్ లో అనసూయ వర్క్ ఔట్స్.. వైరలవుతున్న ఫొటోస్

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న శివాజీ బిగ్ బాస్ కు(Bigg Boss) సంబంధించి మరో ఆసక్తికర విషయాన్నీ వెల్లడించారు. ఇటీవలే తాను నటించిన #90's వెబ్ సీరిస్ లాంచ్ కోసం.. వెంకటేష్ 75 వ సినిమా సైంధవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లానని.. అక్కడ తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవితో(Chiranjeevi) కలిసి మాట్లాడానని చెప్పారు. అయితే చిరంజీవి తనతో మాట్లాడుతూ.. సురేఖ నేను.. డైలీ నీ కోసం బిగ్ బాస్ చూసే వాళ్లమని చెప్పారు. అది విన్న వెంటనే నేను ఆశ్చర్యపోయాను. అలాగే గేమ్ చాలా బాగా ఆడానని మెచ్చుకున్నట్లు తెలిపారు. గతంలో కూడా సీజన్ 4 కంటెస్టెంట్ సోహెల్ కోసం సురేఖ గారు స్వయంగా బిర్యానీ చేసి పంపారు. దీన్ని చిరంజీవి గ్రాండ్ ఫినాలే స్టేజ్ సోహెల్ కు ఇచ్చి  సర్ ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Guntur Kaaram: గుంటూరు కారంలో సూపర్ స్టార్ కృష్ట.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు నిజంగా సంక్రాంతే!

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe