Shine Tom Chacko : అరుదైన వ్యాధితో బాధపడుతున్న 'దేవర' విలన్..! మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ADHD అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ వ్యాధి ఉన్న వ్యక్తులు.. ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారని, ఇతర నటీనటుల నుంచి ప్రత్యేకంగా ఉండటానికి ట్రై చేస్తారని చెప్పాడు. By Anil Kumar 06 Aug 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Actor Shine Tom Chacko : 'అన్నయ్యుం రసూలుం', 'ఇష్క్', 'లవ్', 'జిగర్థండా డబుల్ ఎక్స్', 'భీష్మ పర్వం' వంటి సినిమాతో మలయాళ ఇండస్ట్రీ లో నటుడిగా భారీ గుర్తింపు తెచ్చుకున్న షైన్ టామ్ చాకో.. 'దసరా' సినిమాతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ నటుడు తనకు ADHD అనే వ్యాధి ఉన్నట్లు వెల్లడించాడు. అంతేకాదు తనకు ఈ వ్యాధి రావడం వళ్ళ బాధపడట్లేదని అన్నాడు. ADHD అంటే ఏమిటి? ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఇది ఒక రకమైన నాడీ వ్యవస్థ సంబంధిత సమస్య. ఈ సమస్య ఉన్నవారికి దృష్టి సారించడంలో, హైపర్ యాక్టివిటీ మరియు ఇంపల్సివిటీ (ఆవేశపూరిత ప్రవర్తన) సమస్యలు ఉంటాయి. Also Read : ప్రభాస్ సరసన త్రిష..16 ఏళ్ళ తర్వాత బిగ్ స్క్రీన్ పై అలరించనున్న జోడి! షైన్ టామ్ చాకో మాటల్లో... షైన్ టామ్ చాకో తనకు ADHD ఉన్న విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతను ఈ వ్యాధిని తన బలంగా భావిస్తున్నట్లు చెప్పారు. "ADHD ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఇతరుల దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటారు. నటుడు అవ్వాలనే కోరిక కూడా ఇదే కారణం. ప్రతి ఒక్కరిలోనూ ఈ లక్షణం కొంతవరకు ఉంటుంది. అందుకే మనం బయటకు వెళ్లి అందంగా తయారవుతాం. ADHD ఉన్నవారిలో ఈ ప్రవర్తన మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని డిజార్డర్ అంటారు. నాకు ADHD ఉంది. ఇది నాకు చాలా మంచి లక్షణం. బయట వ్యక్తులు దీన్ని ఓ రుగ్మతగా భావిస్తారని తాను మాత్రం దీన్ని ఓ క్వాలిటీలానే చూస్తానని" అని షైన్ చెప్పారు. #actor-shine-tom-chacko మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి