Naveen Polishetty : 'జాతి రత్నాలు' హీరోకు ప్రమాదం.. చేతికి గాయం, స్వయంగా బయటపెట్టిన నవీన్ పోలిశెట్టి!

హీరో నవీన్ పోలిశెట్టి తాజాగా గాయాల పాలయ్యాడు. దీనిపై అతను సొషల్ మీడియా వేదికగా స్పందించాడు. అనుకోకుండా కుడి చేతికి ఫ్యాక్చర్ అయ్యింది. కాలుకు కూడా గాయమైందని తెలుపుతూ ఓ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశాడు.

New Update
Naveen Polishetty : 'జాతి రత్నాలు' హీరోకు ప్రమాదం.. చేతికి గాయం, స్వయంగా బయటపెట్టిన నవీన్ పోలిశెట్టి!

Actor Naveen Polishetty Shares His Health Update : 'జాతి రత్నాలు' సినిమాతో హీరోగా భారీ క్రేజ్ తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి తాజాగా గాయాల పాలయ్యాడు. అమెరికాలో ఈ ప్రమాదం జరిగినట్లు ఇప్పటికే వార్తలు వినిపించగా.. హీరో నవీన్ పోలిశెట్టి సోషల్ మీడియా వేదికగా హెల్త్ అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు ఓ స్పెషల్ నోట్ రిలీజ్ చేశాడు. ఆ నోట్ లో తన హెల్త్ గురించి మాట్లాడుతూ.."నా లైఫ్ అప్‌డేట్‌ను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అనుకోకుండా నా కుడి చేతికి ఫ్యాక్చర్ అయ్యింది.

అలాగే నా కాలుకు కూడా గాయమైంది. ప్ర‌స్తుతం ఈ నొప్పి భ‌రించ‌లేనంత‌గా ఉంది. ఈ గాయం కారణంగా మీరు అనుకున్నంత వేగంగా నా సినిమాలు తీసుకురాలేను.కోలుకోవడం చాలా నెమ్మదిగా ఉంది అలాగే చాలా కష్టంగా ఉంది, కానీ నేను పూర్తి రికవరీ దిశగా వైద్య నిపుణులతో సన్నిహితంగా పని చేస్తున్నాను కాబట్టి నేను నా ఎనర్జిటిక్ బెస్ట్ మీ అందరికీ అందించగలను. నేను మునుపెన్నడూ లేనంత బలంగా, ఆరోగ్యంగా తిరిగి రావాలని డిసైడ్ అయ్యాను.

Also Read : ఫిల్మ్ ఫేర్ అవార్డుల కోసం పోటీ పడుతున్న తెలుగు సినిమాలు ఇవే..

గుడ్ న్యూస్ ఏమిటంటే.. నా నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల కోసం చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నాను. దీనికోసం డెవలప్‌మెంట్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. నేను రిక‌వ‌రీ అయిన అనంత‌రం వాటిని మొద‌లుపెడ‌తాను. ద‌య‌చేసి నా గురించి వినే వార్త‌లు నేను అప్‌డేట్ ఇస్తేనే న‌మ్మండి. ఎప్పటిలాగే మీ ప్రోత్సాహం, ప్రేమ నాపై ఉన్నందుకు ధన్యవాదాలు!. నేను మళ్లీ తెరపైకి వచ్చి మిమ్మల్ని మరోసారి అలరించడానికి వేచి ఉండలేను.ఎప్పటిలాగే మీ ప్రేమను కురిపించడానికి మీరు సిద్ధంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను!. ఇట్లు మీ జానీజీగార్" అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

publive-image

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు