Murali Mohan: మేమే కూల్చేస్తాం.. హైడ్రా నోటీసులపై మురళీమోహన్ రియాక్షన్

TG: హైడ్రా నోటీసులపై మురళీమోహన్ స్పందించారు. బఫర్‌జోన్‌లో 3 అడుగుల మేర రేకుల షెడ్ ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు.. వాటిని మంగళవారంలోగా మేమే తొలిగిస్తామని అన్నారు. జయభేరి ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని అన్నారు.

Murali Mohan: మేమే కూల్చేస్తాం.. హైడ్రా నోటీసులపై మురళీమోహన్ రియాక్షన్
New Update

Murali Mohan: హైడ్రా నోటీసులపై స్పందించారు సినీనటుడు మురళీమోహన్. హైడ్రా తనకు నోటీసులు ఇచ్చిన మాట నిజమే అని అన్నారు. నానక్‌రూమ్‌గూడలోని రంగలాల్‌కుంట బఫర్‌జోన్‌లో 3 అడుగుల మేర రేకుల షెడ్ ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారని చెప్పారు. 15 రోజుల్లో బఫర్‌ జోన్‌లో ఉన్న షెడ్‌ను తొలగించకుంటే మేమే కూల్చేస్తామని హైడ్రా ఆదేశించిందని అన్నారు. మంగళవారంలోగా మేమే షెడ్‌ తొలగించేస్తాం అని చెప్పారు. జయభేరి ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని అన్నారు. మూడు దశాబ్దాలుగా తాము రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నామని, అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు.

15 రోజుల్లోగా..

హైదరాబాద్ అంతటా ఆక్రమణలను తొలగించి చెరువులను రక్షించేందుకు హైడ్రా తన దూకుడు ప్రయత్నాలను కొనసాగిస్తోంది. నటుడు నాగార్జునకు చెందిన N. కన్వెన్షన్‌తో సహా పలు అక్రమ నిర్మాణాలను ఇప్పటికే కూల్చివేసిన హైడ్రా ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ జయభేరికి నోటీసు జారీ చేసింది. ఫైనాన్షియల్‌ జిల్లాలోని రంగలాల్‌ కుంట చెరువులో ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (FTL), బఫర్‌ జోన్‌ పరిధిలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని హైడ్రా అధికారులు జయభేరి కన్‌స్ట్రక్షన్‌ కంపెనీని ఆదేశించారు. 

హైడ్రా కమీషనర్ రంగనాథ్ భగీరథమ్మ చెరువును పరిశీలించిన అనంతరం ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణ వ్యర్థాలను డంపింగ్ చేయడంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చివేయాలని నోటీసులు ఇచ్చారు. లేనిపక్షంలో తామే కూల్చివేస్తామని నోటీసులో హైడ్రా పేర్కొంది.

#murali-mohan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe