Mohanlal: వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. ఈ ప్రకృతి విపత్తులో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కుప్పకూలిన భవనాలు, శిథిలాల కింద ప్రాణాలతో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
వయనాడ్‌లో నటుడు మోహన్ లాల్ పర్యవేక్షణ
విపత్తు కారణంగా అతలాకుతలమైన వయనాడ్ ప్రాంతాన్ని నటుడు మోహన్ లాల్ పర్యటించారు. టెరిటోరియల్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ముండక్కై, చుర్‌ము లాల్ సహా కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం విపత్తు బాధితులను పరామర్శించారు. అక్కడి అధికారులను సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ... బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్న సైన్యంతో సహా అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కొండచరియలు విరిగిపడిన విపత్తు ప్రాంతం పునరావాసం కోసం తన ఫౌండేషన్ విశ్వశాంతి తరుపున 3 కోట్లు విరాళం ప్రకటించారు. తాను మెంబర్‌గా ఉన్న టెరిటోరియల్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్‌ల కోసం విపత్తు ప్రాంతానికి వచ్చిందని.. అందులో భాగమైన తాను కూడా ఇక్కడికి వచ్చానని మోహన్‌లాల్ తెలిపారు. అయితే 2009లో మోహన్ లాల్ కు ప్రభుత్వం టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ పదవిని ప్రదానం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మోహన్ లాల్ బాధితులకు సహాయంగా రూ. 25 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇచ్చారు.
Also Read: Nayanthara : వయనాడ్ విపత్తుకు నయనతార, విఘ్నేశ్ దంపతుల భారీ విరాళం.! - Rtvlive.com