Kushboo: మగాడివేనా నువ్వు? రెచ్చిపోయిన కుష్బూ..!!

టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై సీనియర్ నటి కుష్బూ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలు దారుమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఒక మనిషిగా కూడా ఆయన విఫలమయ్యారని కుష్బూ మండిపడ్డారు.

New Update
Kushboo: మగాడివేనా నువ్వు? రెచ్చిపోయిన కుష్బూ..!!

ఈ విషయంలో మంత్రి రోజాకు తన మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. బండారు తక్షణమే రోజాకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. బండారు క్షమాపణలు చెప్పే దాకా సాగే పోరాటంలో తాను కలుస్తానని చెప్పారు. మహిళల కోసం రిజర్వేషన్ బిల్లు(నారీ శక్తి వందన్ అధినియం బిల్లు) ప్రధాని మోదీ తెచ్చారని, మహిళ సాధికారత కోసం చర్చ జరుగుతున్న సమయంలో బండారు లాంటి వాళ్లు మహిళా నేతలను ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడతారా..? అని కుష్బూ ఆవేదన ‍వ్యక్తం చేశారు.

టీడీపీ నేత బండారు చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అసత్య ఆరోపణలు, విమర్శలతో మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న టీడీపీ దుశ్సాసన పార్టీ అని ఆమె ఘాటుగా విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మహిళా లోకాన్నే అవమానించేలా మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యక్తిగత విమర్శలపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను టీడీపీ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి వేధిస్తున్నారంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

Also Read: నేడు రాజమండ్రికి వెళ్ళనున్న లోకేష్

Advertisment
తాజా కథనాలు