/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/crime-1-jpg.webp)
Mahabubnagar: సుప్రసిద్ధ రంగస్థల నటుడు, ఆదర్శ రైతు కోట్ల వేమారెడ్డి ఆకస్మిక మరణం చెందారు. మహబూబ్‌నగర్‌కు చెందిన వేమారెడ్డి ఆదివారం సాయంత్రం అనారోగ్యం కారణంగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం దుప్పల్లిలో అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు. దుర్యోధనుడు, కర్ణుడు, కృష్ణుని వంటి పాత్రలకు జీవం పోసిన ఆయన.. రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు దక్కించుకున్నారు. వేమారెడ్డికి ఒక కుమారుడు, నలుగురు కూతుళ్ళు ఉన్నారు. ఆయన మరణం నాటక రంగానికి తీరని లోటని ఉమ్మడి జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షులు వి.మనోహర రెడ్డి,కోట్ల వెంకటేశ్వర రెడ్డి, బాద్మి శివ కుమార్, జయరాములు సంతాపం వ్యక్తం చేశారు.