/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-34-4.jpg)
Actor Kiran Abbavaram Wedding : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ప్రేయసి రహస్య గోరఖ్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కర్ణాటక కూర్గ్‌లోని ఓ రిసార్ట్‌లో గురువారం రాత్రి వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరగింది. తెలుగు సాంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ పెళ్ళికి కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Congratulations to #KiranAbbavaram and #RahasyaGorak on your marriage! Wishing you both a lifetime of love, happiness, and togetherness. May your journey ahead be filled with joy and beautiful memories!#KA #KiranAbbavaramMarriage pic.twitter.com/lLx6tLr11s
— ᏰᏗᏝᏗ (@balakoteswar) August 22, 2024
Also Read : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టైటిల్ మార్పు వెనక అసలు కారణం అదే : హరీష్ శంకర్
వీటిని చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వారే. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట.. ఇప్ప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
Wedding bells for the hero @Kiran_Abbavaram and #RahasyaGorak 😍😍
The adorable couple ties knot in the presence of near and dear ones ❤️ #KiranRahasya#KiranAbbavaram pic.twitter.com/RKQUy4uvdS— Aithagoni Raju off (@AithagoniRaju) August 22, 2024