/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/jj-jpg.webp)
Jagapathi Babu : ఇకపై అభిమాన సంఘాలు, ట్రస్టుతో తనకు ఎటువంటి సంబంధం ఉండదని ప్రముఖ సినీనటుడు జగపతి బాబు ‘ఎక్స్(X)’ వేదికగా సంచలన ప్రకటన చేశారు. అభిమానం పేరిట తాను ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ చూసిన సినీ యాక్టర్స్ షాక్ అవుతున్నారు.
నా అభిమానులకు మనవి…. pic.twitter.com/iLN9tToL7T
— Jaggu Bhai (@IamJagguBhai) October 7, 2023
గత 33 ఏళ్లుగా అభిమానులు తన కుటుంబంగా, శ్రేయోభిలాషులుగా తన ఎదుగుదలకు కారణమయ్యారని జగపతిబాబు గుర్తు చేసుకున్నారు. తనూ అభిమానుల కష్టసుఖాల్లో తోడుగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అభిమానుల ఇబ్బందులు తనవిగా భావించి వారికి అండగా నిలిచానన్నారు. అయితే, కొంతమంది మాత్రం అభిమానం కంటే తన నుంచి ఆశించడం ఎక్కువైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానం పేరిట తాను ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారన్నారు.
దీంతో, ఇకపై అభిమాన సంఘాలు, ట్రస్టుకు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు తేల్చి చెప్పారు. అయితే, తనపై ప్రేమ కురిపించే అభిమానులకు మాత్రం ఎప్పుడూ తోడుగా ఉంటానని పేర్కొన్నారు. జీవంచండి..జీవంచనీయండి అంటూ పోస్ట్ పెట్టడంతో పలువురు షాక్ అవుతున్నారు. మరోవైపు, జగపతి బాబుకు అండగా నిలుస్తుమని.. ఆయన నిర్ణయం సమర్థనీయమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: బిగ్ బాస్ ఇంట్లో హీరో రవితేజ, సిద్దార్థ్ సందడి.. ముగ్గురు ఎలిమినేటెడ్..!
Follow Us