Big Breaking: సినీ ఇండస్ట్రీలో విషాదం.. చంద్రమోహన్ ఇకలేరు

సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ (82) ఈరోజు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు హృద్రోగంతో కన్ను మూశారు.

New Update
Big Breaking: సినీ ఇండస్ట్రీలో విషాదం.. చంద్రమోహన్ ఇకలేరు

తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీనియర్ హీరో, నటుడు చంద్రమోహన్ ఈరోజు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఆయన వయసు 82 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయి. గత కొన్నాళ్లుగా షుగర్‌తో బాధపడుతున్న చంద్రమోహన్‌కు కొన్నాళ్లుగా కిడ్నీ డయాలసిస్‌ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆరోగ్య విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందతూ కన్ను మూశారు. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ నటీ, నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Also read: నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ.. ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన ?

కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్‌ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌ రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ చదివారు. 1966లో రంగుల రాట్నం అనే సినిమాతో అరంగేట్రం చేశారు. పలు తమిళ సినిమాల్లోనూ నటించారు. తన నటనకు గానూ ఫిలింఫేర్‌, నంది అవార్డులు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు’, ‘సిరి సిరి మువ్వ’ సినిమాల్లో ఆయన నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు దక్కాయి. దివంగత దర్శకుడు కె. విశ్వనాథ్‌కు కూడా చంద్రమోహన్‌ సమీప బంధువు.

తొలి సినిమాకే ఉత్తమ నంది అవార్డు తెచ్చుకున్న నటుడిగా చంద్రమోహన్ రికార్డు సృష్టించారు. 1987లో చందమామ రావే చిత్రానికి ఆయన నంది అవార్డు అందుకున్నారు. అతనొక్కడే సినిమాలో ఆయన పోషించిన సహాయ నటుడి పాత్రకు కూడా నంది అవార్డు దక్కింది. పదహారేళ్ల వయసు సినిమాకు ఫిల్మ్ ఫేర్‌ అవార్డు అందుకున్నారు. రంగుల రాట్నం, పదహారేళ్ల వయసు, సీతామాలక్ష్మి, రాధాకల్యాణం, రెండు రెళ్ల ఆరు, చందమామ రావే, రామ్‌ రాబర్ట్ రహీమ్‌ చిత్రాలతో ఆయన ఫేమస్‌ అయ్యారు. 2017లో విడుదలైన దువ్వాడ జగన్నాధం ఆయన చివరిసారిగా నటించిన పెద్ద సినిమా.

Advertisment
తాజా కథనాలు