Aishwarya Arjun: టాలీవుడ్ సీనియర్ నటుడు అర్జున్ ఇంట పెళ్లి సంబరాలు ఘనంగా ముగిశాయి. నేడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్, తమిళ హీరో ఉమాపతి రామయ్య వివాహ బంధంతో ఒకటయ్యారు. చెన్నైలోని హనుమాన్ ఆలయంలో జరిగిన వీరి వివాహ వేడుకలకు , సన్నిహితులు, బంధువులు, ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు. సముద్రఖని, విశాల్ తండ్రి జీకే రెడ్డి, కేఎస్ రవికుమార్, నటుడు విజయ కుమార్తో పాటు పలువురు తమిళ స్టార్స్ వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకల అనంతరం చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో ఐశ్వర్య, ఉమాపతి రెసెప్షన్ వేడుకలు జరగనున్నాయి. ఐశ్వర్య అర్జున్ వెడ్డింగ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు మీరు కూడా చూసేయండి.