Loan Apps Ads : నకిలీ లోన్ యాప్స్ ప్రకటనలపై ప్రభుత్వం కొరడా 

సోషల్ మీడియాలో వచ్చే నకిలీ లోన్ యాప్స్ ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. ఇటువంటి ప్రకటనలు సోషల్ మీడియాలో రాకుండా చేయడం కోసం చట్ట సవరణ చేయాలనీ ప్రయత్నిస్తోంది. నకిలీ లోన్ యాప్స్ ప్రకటనలపై నిషేధం తీసుకురానుంది. 

Loan Apps Ads : నకిలీ లోన్ యాప్స్ ప్రకటనలపై ప్రభుత్వం కొరడా 
New Update

Social Media Scams : ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్(Instagram) వంటి సోషల్ మీడియా(Social Media) ప్లాట్‌ఫామ్‌లలో మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోబోతోంది. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో నేరాలు, మోసాల కేసులు భారీగా పెరిగాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల సహాయంతో, సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) నకిలీ రుణ యాప్‌(Duplicate Loan Apps) ల ఉచ్చులోకి ప్రజలను ఆకర్షించి వారిని మోసం చేస్తున్నారు. ఇప్పుడు దీనిపై నడుం బిగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ప్రభుత్వం కఠిన చర్యలు..

మీడియా నివేదికల ప్రకారం, నకిలీ రుణ యాప్‌లకు(Loan Apps Ads) సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతోంది. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించి ట్రాప్ చేస్తున్నారు. దీని కోసం, ఈ నేరగాళ్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రకటనలను ఇవ్వడం ద్వారా నకిలీ రుణ యాప్‌లను ప్రమోట్ చేరారు. డబ్బు అవసరమైన వ్యక్తులు దీనిని చూసి వారి మాయలో పడతారు. ప్రభుత్వం ఇప్పుడు సోషల్ మీడియా సంస్థలపై ఒత్తిడి తీసుకురాబోతోంది. ఇటువంటి ప్రకటనలు తమ ప్లాట్ ఫామ్స్ లో తీసుకునే ముందు ఆ యాప్ ల స్థితిగతులను విచారిస్తారు. ఆ తరువాతే ప్రకటనలను అంగీకరిస్తారు. 

నిబంధనల సవరణ..

ఇందుకోసం ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను(IT Rules) సవరిస్తామని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రేష్‌కర్ తెలిపారు. భారతదేశంలో సోషల్ మీడియా ద్వారా నకిలీ లోన్ యాప్‌లు వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతోందని ఆయన అన్నారు. ఈ దిశగా ఇప్పటికే ఉన్న నిబంధనలను సవరిస్తామని, తద్వారా ఈ ప్లాట్‌ఫారమ్‌లలో నకిలీ రుణ యాప్‌ల ప్రకటనలను నిషేధించవచ్చని మంత్రి తెలిపారు. అయితే ఏప్రిల్-మేలో లోక్‌సభ ఎన్నికలు జరగొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో అవసరమైన మార్పులు ఎన్నికల తర్వాతే చేయవచ్చు.

Also Read:  ఏబీవీపీ నుంచి పద్మవిభూషణ్ దాకా వెంకయ్య నాయుడి తిరుగులేని ప్రస్థానం 

కొత్త నిబంధన ఏమిటి?

ప్రస్తుత నిబంధనలలో, నకిలీ లోన్ యాప్‌లకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నేరస్థులపై చర్య తీసుకునే నిబంధన లేదు. సాధారణంగా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ప్రస్తుతం రుసుము వసూలు చేయడం ద్వారా ప్రకటనలను అమలు చేయడానికి అనుమతిస్తాయి. కానీ సైబర్ నేరగాళ్లు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వినియోగదారులు ఒకవేళ రిపోర్ట్ చేస్తే, సోషల్ మీడియా కంపెనీలు ప్రకటనలను తీసివేస్తాయి. అయితే, అప్పటికి చాలా మంది దీని బాధితులుగా మారుతారు.  ఇప్పుడు కొత్త చట్టాన్ని సవరించడం ద్వారా, నకిలీ లోన్ యాప్‌ల ప్రకటనలను అమలు చేయడానికి సోషల్ మీడియా కంపెనీలకు ఇచ్చిన చట్టపరమైన మినహాయింపు ముగుస్తుంది.

Watch this interesting Video:

#social-media #cyber-criminals #fake-loan-apps
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe