Acham Naidu: వైసీపీని బంగాళాఖాతంలో కలుపుతాం..అచ్చెన్న వార్నింగ్

చంద్రబాబు జైలు నుంచి అడుగు బయటపెట్టిన క్షణం నుంచే వైసీపీ పతనం ప్రారంభమవుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. అక్రమ కేసులు పెట్టి, జైల్లో ఉంచి లబ్ధి పొందాలని జగన్ చూశారని విమర్శించారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదని.. పార్టీలో ఎవరు తప్పు చేసినా ఆయన సహించరని చెప్పారు. చంద్రబాబుపై లిక్కర్ కేసు పెట్టించిన సైకో జగన్ అని మండిపడ్డారు.

New Update
Atchannaidu: "జగన్ నాలుగేళ్ల 7 నెలల పాలనలో జరిగింది ఇదే"

Acham Naidu Fires on Jagan: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష పెట్టుకుని, తప్పు లేకపోయినా కేసులు పెట్టారనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసి పోయిందని అన్నారు. అక్రమ కేసులు పెట్టి, జైల్లో ఉంచి లబ్ధి పొందాలని జగన్ చూశారని విమర్శించారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదని.. పార్టీలో ఎవరు తప్పు చేసినా ఆయన సహించరని చెప్పారు.

మహానుభావుడు చంద్రబాబును ఈ మూర్ఖుడు, ఈ దుర్మార్గుడు జగన్ 52 రోజుల పాటు జైల్లో పెట్టించారని అచ్చెన్న మండిపడ్డారు. బెయిల్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తే.. రాత్రికి రాత్రే చంద్రబాబుపై లిక్కర్ కేసు పెట్టించిన సైకో అని దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్ట్ జగన్ పతనానికి నాంది అని.. బాబు జైలు నుంచి బయటకు అడుగు పెట్టిన క్షణం నుంచే వైసీపీ పతనమవుతుందని చెప్పారు. వైసీపీని బంగాళాఖాతంలో కలుపుతామని వ్యాఖ్యానించారు. హైకోర్టులో ఈరోజు తమకు న్యాయం జరిగిందని అన్నారు.

హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో.. దాదాపు 52 రోజుల జైలు జీవితం తర్వాత చంద్రబాబు నాయిడు విడుదలయ్యారు. చంద్రబాబుకు అచ్చెన్నాయుడు, బాలకృష్ణతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరినీ చేయనివ్వలేదని స్పష్టం చేశారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తన అరెస్ట్ ను ఖండించిన బీఆర్ఎస్ తో పాటు అన్ని రాజకీయ పార్టీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు రోడ్లపైకి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు చూపిన అభిమానాన్ని తాను మరిచిపోలేనన్నారు. ప్రజల ప్రేమతో తన జీవితం ధన్యమైందని భావోద్వేగానికి గురయ్యారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు