Hyderabad Minor Girl Rape Case: 2017లో తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన సరూర్‌నగర్‌లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ఎట్టకేలకు ఎల్బీ నగర్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం తీర్పును వెల్లడించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న యువకుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కోర్టు అతనికి రూ.11,000 జరిమానా కూడా విధించింది. బాధితురాలికి రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.
ALSO READ: బలపరీక్షకు సిద్ధం.. అధికారంలో ఉండేది బీజేపీనే.. సీఎం నయాబ్ సింగ్ సైనీ ధీమా
అసలేమైంది.. మే 2017లో సరూర్‌నగర్‌లోని కర్మన్‌ఘాట్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి మహ్మద్ ఖాజా మొయినుద్దీన్ (19) అనే వ్యక్తి అదే కాలనిలో నివాసం ఉంటున్న మైనర్ బాలికను తినుబండారాలతో బాలికను ప్రలోభపెట్టి తన ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి ఖాజా మొయినుద్దీన్‌ను అరెస్టు చేశారు. కాగా వాయిదా పడుకుంటూ వచ్చిన ఈ కేసుపై ఎట్టకేలకు కోర్టు తీర్పును వెలువరించింది.
కాగా.. రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారి, అతని బృందం కృషిని అభినందించి వారికి రివార్డులు ప్రకటించారు. ఇదిలా ఉంటే కోర్టు ఇచ్చిన తీర్పుపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు మాత్రం భవిష్యత్ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కోర్టు ఇలాంటి తీర్పును ఇస్తే అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించాలని అనుకునే వారికి భయం ఉంటుందని అంటున్నారు.